ఆంధ్ర ప్రదేశ్

ఏపీ లిక్కర్‌ కేసు ముగిసినట్టేనా..!

ఏపీ లిక్కర్‌ కేసు కంచికి చేరిందా..? ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి ఒక్కొక్కరుగా బెయిల్‌ వస్తోంది. సిట్‌ వేసిన ఛార్జ్‌షీట్‌లో అభ్యంతరాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు కూడా అబ్జెక్షన్‌ పెట్టింది. ఇప్పటికే నలుగురు నిందితులు బెయిల్‌పై ఉన్నారు. మరి కేసు విచారణ ఏమైంది…? ఇక అంతే సంగతులా…? బిగ్‌బాస్‌ సంగతి ఏం చేస్తారా…? ఈ కేసులో నిజంగా బిగ్‌బాస్‌ ఉంటే.. ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్‌ చేయలేదు..? ఎందుకు సానుభూతి చూపుతున్నారు..? ఆధారాలు లేవా..? లేక.. ఇప్పటి వరకు అల్లింది కట్టుకథేనా..? ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో ముగ్గురు నిందులకు బెయిల్‌ రావడంతో.. ప్రస్తుతం ఈ చర్చే జరుగుతోంది.

లిక్కర్‌ పాలసీలో 3వేల 500 కోట్లకుపైగా భారీ స్కామ్‌ జరిగిందని… కేసు పెట్టారు. విచారణ కోసం సిట్‌ను వేశారు. ఏడాదిగా విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు సుమారు 12, 13 మందిని అరెస్ట్‌ చేశారు. వారిలో నలుగురు బయటకు వచ్చారు. ఏడాదిగా విచారణ చేసిన సిట్‌ రెండు ఛార్జ్‌షీట్లు వేసింది… అందులో అభ్యంతరాలు ఇచ్చాయి విజయవాడ ఏసీబీ కోర్టు తెలిపింది. ఇక్కడే చాలా అనుమానాలు వస్తున్నాయి. అసలు ఈ కేసులో పస ఉందా..? లేక హడావుడి మాత్రమేనా అన్న చర్చ జరుగుతోంది.

Also Read : ఫ్రీజర్ లో నవజాత శిశువు.. ఏడుపు విని బయటకు తీసిన కుటుంబ సభ్యులు!

బిగ్‌బాస్‌.. బిగ్‌బాస్‌ అంటూ ఊదరగొట్టారు. మరి ఆ సంగతి ఏమైంది. నేడో రేపో బిగ్‌బాస్‌ అరెస్ట్‌ అవుతారు.. ఇదిలో ఈ నెలాఖరులో అరెస్ట్‌ తప్పదు… వచ్చే నెలాఖరులోగా అరెస్ట్‌ చేసేస్తారు అంటూ వార్తలు వచ్చాయి. మరి అదంతా ఏమైంది. నిజంగా లిక్కర్‌ స్కామ్‌ వెనుక బిగ్‌బాస్‌ ఉంటే… ఎందుకు అరెస్ట్‌ చేయలేకపోతున్నారు. ఎవరెవరినో ఎందుకు జైలు పంపుతున్నారు. లబ్దిపొందారని ఆరోపణలు ఉన్నవారిని ఎందుకు అరెస్ట్‌ చేయడంలేదా..? అంటే ఈ స్కామ్‌ ఒక రాజకీయ డ్రామానా..? అన్న ప్రశ్న మొదలవుతోంది. ఈ కేసులో అన్నీ అనుమానాలే తప్ప ఆధారాలు కనిపించడంలేదు.

హైదరాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో సీజ్‌ చేసిన 11 కోట్లు.. లిక్కర్‌ కేసులో నిందితుడుగా ఉన్న రాజ్‌ కేసిరెడ్డి చెందినవి సిట్‌ అంటోంది. కానీ.. దానికి సంబంధించి పక్కా ఆధారాలు మాత్రం కోర్టు సమర్పించిన దాఖలాలు లేవు. పైగా ఈ కేసుకు సంబంధించి రోజుకో కథ.. పుట్టుకొస్తోంది. ఆ కథలను ఎవరు పుట్టిస్తున్నారు.. ఎవరు ప్రచారం చేస్తున్నారో కూడా తేల్చలేదు. నిందితులకు కూడా బెయిల్‌ వస్తుండటంతో… లిక్కర్‌ కేసు పేరుతో చేసిన హడావుడి.. ఇక… కంచికి చేరే సమయం వచ్చిందని అధికార పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి.

Also Read More :

ఉన్నట్టుండి రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ!.. ఏం కటౌట్ రా బాబు.. వర్కౌట్ అవుతుందా?

టీటీడీ ఈవో శ్యామలరావు బదిలీ వెనుక కారణం అదేనా..!

బర్త్ డే చేస్తామని పిలిచి, యువతిపై గ్యాంగ్ రేప్!

సీఎం రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు.. ఇక రాజీనామానే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button