
Andhrapradesh News : చంద్రబాబు సర్కార్‌ను టీటీడీని ప్రక్షాళన చేస్తోందా..? కొంత కాలంగా టీటీడీపై వస్తున్న ఆరోపణలతో ప్రభుత్వం కాస్త ఇరకాటంలో పడుతోంది. చిన్న తప్పు జరిగినా వైసీపీ ఎత్తిచూపుతోంది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. వాటన్నింటికీ చెక్ పెట్టేందుకే అధికారుల్లో మార్పులు చేర్పులు చేపట్టిందా..? అందుకే టీటీడీ ఈవోగా శ్యామలరావును తప్పించి…. మళ్లీ అనిల్‌కుమార్ సింఘాల్‌ను నియమించిందా. ఏమోగానీ… టీటీడీ ఈవో మార్పుపై చర్చ అయితే జరుగుతోంది.
టీటీడీ ఈవోగా శ్యామలరావును ట్రాన్స్‌ఫర్ చేసి.. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్‌కుమార్ సింఘాల్‌ను నియమించింది ఏపీ ప్రభుత్వం. సింఘాల్.. నిమాయంతో.. టీటీడీ అన్నీ పద్ధతి ప్రకారం జరుగుతాయని.. పొరపాట్లు లేకుండా జరుగుతాయన్న నమ్మకం ఉంది. సింఘాల్… వేంకటేశ్వరస్వామి భక్తులు. అవినీతి ఆరోపణలు లేని అధికారి. చిన్న వయస్సులోనే ఐఏఎస్ అధికారి అయ్యారు. చంద్రబాబుకు నమ్మకస్తుడు. ముఖ్యంగా టీటీడీపై ఆయనకు పట్టు ఉంది. ఇప్పటికే ఒకసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. అది కూడా చంద్రబాబు హయాంలోనే. అప్పటి ఆయన సేవలను గుర్తించే… ఇప్పుడు మరోసారి ఆయన్ను టీటీడీ ఈవోగా నియమించినట్టు తెలుస్తోంది. వైసీపీ హాయాంలోనూ రెండేళ్లపాటు ఈవోగా ఉన్నారు సింఘాలు.
Also Read : ఉన్నట్టుండి రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ!.. ఏం కటౌట్ రా బాబు.. వర్కౌట్ అవుతుందా?
ఏపీలో కూటమి సర్కార్ ఉన్నా… టీటీడీలో మాత్రం తరచూ ఏదో ఒక అలజడి వస్తూనే ఉంది. గోషాలల నిర్వహణ సరిగా లేదనే. అన్యమతస్తులు వస్తున్నా పట్టించుకోవడంలేదనో.. ఇలా.. ఏదో విషయంలో రచ్చ జరుగుతూనే ఉంది. పైగా… ముక్కోటి సమయంలో జరిగిన తొక్కిసలాట. అది మహా విషాదం. టీటీడీ అధికారుల్లో సమన్వయలోపలే… ఇలాంటి వివాదాలకు కారణమన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్‌కు, ఈవో శ్యామలరావు మధ్య గ్యాప్ ఉన్నట్టు కూడా వర్తలు వచ్చాయి. ఈ క్రమంలో… మార్పులు అవసరమని ప్రభుత్వం భావించి ఉండొచ్చు. కొద్దిరోజుల్లో.. దసరా బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభంకాబోతున్నాయి. ఈ సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే… టీటీడీ ఈవో శ్యామలరావును బదిలీ చేసి… సమర్థుడని భావిస్తున్న సింఘాల్‌కు ఆ బాధ్యతలు అప్పగించిందని టీటీడీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read : మన దేశంలో అత్యంత ధనిక మంత్రి ఎవరో తెలుసా?.. టాప్ 10 మంత్రులు వీరే!
గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన సింఘాల్‌కు… ఎవరిని ఎలా కట్టడి చేయాలో బాగా తెలుసు. హోదా ఉంది కదా అని పెత్తనం చేయాలనుకునే వారికి ఎలా చెక్ పెట్టాలో కూడా ఆయన బాగా తెలుసు. అంతేకాదు.. ఎవరినీ నొప్పించకుండా… అన్నీ చక్కబెట్టగలరు. భక్తులను కూడా మిప్పించగల నిర్ణయాలు తీసుకుంటారని కూడా ఆయనకు పేరుంది. సింఘాల్ మంచి అధికారి.. ప్రతిభ గల ఆఫీసర్ అని చంద్రబాబుకు విశ్వాసం. అందుకే ఆయన్ను మరోసారి టీటీడీ ఈవోగా నియమించారు.