
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత క్రికెటర్ రోహిత్ శర్మ ‘హిట్ మ్యాన్’ గా గుర్తింపు పొందారు. మైదానంలోకి అడుగుపెడితే కచ్చితంగా ఒకటి లేదా రెండు సిక్స్ లు కొట్టంది బయటకు అడుగుపెట్టడు. టీమిండియా కు కెప్టెన్ గా వ్యవహరించి ఎన్నో మ్యాచ్లలో అద్భుతమైన విజయాలను అందించారు. ప్రస్తుతం అంతర్జాతీయ టెస్ట్ మరియు టి20 లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ వన్డే మ్యాచ్లు ఆడడానికి తహతహలాడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్లో రోహిత్ శర్మ ఖచ్చితంగా ఆడుతారని ఇప్పటికే సమాచారం అందింది. ఇంకా ఈ మ్యాచ్ ద్వారా ఎన్నో రోజుల తర్వాత మైదానంలోకి దిగబోతున్న రోహిత్ శర్మ కి ఎన్నో రికార్డులు చేరువలో ఉన్నాయి.
Read also :పాత సెల్ ఫోన్లుకు స్టీల్ సామాన్లు ఇస్తామమ్మా… తెలంగాణలో సరికొత్త మోసగాళ్లు?
రోహిత్ శర్మ ఒకే ఒక మ్యాచ్ ఆడితే అంతర్జాతీయ క్రికెట్లో 500 మ్యాచులు ఆడిన ప్లేయర్ గా రికార్డు సృష్టిస్తారు. ఇక మరో 8 సిక్సర్లు కొడితే వన్డే మ్యాచ్లో అత్యధిక సిక్సర్ల రికార్డును నమోదు చేయనున్నాడు. ఒక సెంచరీ చేస్తే 50 అంతర్జాతీయ శతకాలు నమోదు చేసిన ప్లేయర్ గా మరో రికార్డు సృష్టించినున్నాడు. మరో 300 పరుగులు చేస్తే ఇంటర్నేషనల్ మ్యాచ్లలో 20 వేల పరుగులు పూర్తి చేసుకుంటారు. కేవలం 3 క్యాచులు పడితే వన్డే మ్యాచ్లో 100 క్యాచులు పూర్తి చేసుకున్న ప్లేయర్ గా నిలుస్తారు. ఇవన్నీ కూడా త్వరలో జరగబోయేటువంటి ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చేస్తే ఒకటి లేదా రెండు మ్యాచ్లలోనే చేయవచ్చు. ఆ సత్తా కేవలం రోహిత్ శర్మకు మాత్రమే కలదు. దీంతో ఈ రికార్డులన్నీ కూడా ఆస్ట్రేలియా మీదే నమోదు చేయాలని… ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు రోహిత్ శర్మ చాలా రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అభిమానులు ఘన స్వాగతం పలికే అవకాశాలు ఉన్నాయి.
Read also : పాత సెల్ ఫోన్లుకు స్టీల్ సామాన్లు ఇస్తామమ్మా… తెలంగాణలో సరికొత్త మోసగాళ్లు?