
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ :-
…తాను నష్టపోయినా పర్వాలేదు..
భారత్ మాత్రం
బాగుపడకూడదు అని
పాకిస్థాన్ పాలకులు భావిస్తున్నట్లు
కనిపిస్తోంది…
ఎందుకంటే.. యుద్ధం ద్వారా భారత్ని ఏ విధంగానూ ఎదుర్కోలేం అని గ్రహించిన పాలకులు.. అణుదాడి చెయ్యడమే
ఉన్న మార్గం అని భావిస్తున్నట్లు
పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే.. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఒక గ్రూపును ఇవాళ(శనివారం) సమావేశానికి పిలిచారు.ఈ గ్రూపు.. అణ్వాయుధాలను పర్యవేక్షిస్తోంది. అంటే..
అణ్వాయుధాలకు సంబంధించిన అన్ని విషయాలూ ఈ గ్రూప్
చుసుకుంటుంది. ఈ గ్రూపును నేషనల్ కమాండ్ అథార్టీ (NCA) అని అంటారు.
ఈ NCA గ్రూపుతో ఇవాళ పాక్ ప్రధాని సమావేశం అవుతారు అని పాకిస్థాన్ సైన్యం తెలిపింది. ఈ నేషనల్ కమాండ్ ఆథార్టీ గ్రూపులో సైనిక అధికారులు ఉంటారు. ఈ గ్రూపు భద్రతా పరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అందువల్ల ఇవాళి సమావేశంలో.. దేశని ఆణ్వాయుధాల భద్రత ఎలా ఉంది.
అవి సెక్యూరిటీతో ఉన్నాయా? ఇండియా చేసే దాడుల వల్ల అణ్వాయుధాలకు ఏదైనా సమస్య వస్తుందా వంటి అంశాలపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది.ఈ సమావేశంలో అణ్వాయుధాలను
భారత్ పైకి ప్రయోగించాలా వద్దా అనే దానిపై చర్చిస్తారని తెలుస్తోంది. కానీ..భారతైపై అణుబాంబు వేస్తే.. భారత్ కూడా వేయగలదు. అప్పుడు అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తియ్యగలదు. అందువల్ల పాకిస్థాన్ అలాంటి దుశ్చర్యకు పాల్పడుతుంది అనుకోలేం. కానీ.. ప్రస్తుత యుద్ధానికి ముందు పాకిస్థాన్ మంత్రులు కొంతమంది ఇండియావైపు 130 అణ్వాయుధాలు గురి పెట్టి ఉన్నాయని
కామెంట్స్ చేశారు. అందువల్ల ఇవాల్టి మీటింగ్ పై రకరకాల సందేహాలు వ్యక్తం
అవుతున్నాయి.
కుట్రపూరిత పాక్ ఎలాంటి దుశ్చర్యకైనా పాల్పడగలదు. ఆ దేశాన్ని నమ్మడానికి లేదు. భారత్కి ఒక రూల్ ఉంది. భారత్ ముందుగా ఏ దేశంపైనా అణు దాడి చెయ్యదు. కానీ పాకిస్థాన్ ఆ రూల్ పెట్టుకోలేదు. ఎందుకంటే.. ఇండియాపై ఎప్పుడు ఈ దాడి చేద్దామా అనే ఆ దేశ పాలకులు ఆలోచిస్తున్నారు. అందుకే.. ఇలాంటి రూల్ పెట్టుకోలేదు. అందువల్ల వారు ముందుగా అణుదాడికి పాల్పడే ప్రమాదం ఉంది. కానీ.. అణుదాడి అనేది అత్యంత ప్రమాదకరం. సెకండ్లలో కోట్ల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందువల్ల అంతటి దుర్మార్గానికి పాకిస్థాన్ పాల్పడుతుందా అనేది చూడాల్సిన అంశం.
పాకిస్థాన్ కి ఇండియాలో డ్రోన్లు, క్షిపణులతో దాడి చెయ్యడానికి వీలు కావట్లేదు. అందుకే.. ఇలా అణ్వాయుధ దాడివైపు చూస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నాలుగు రోజులుగా పాకిస్థాన్ 26 నగరాలూ, ప్రాంతాల్లో దాడులు చేసినా, వాటన్నింటినీ భారత్ విజయవంతంగా తిప్పికొట్టింది. దాంతో.. సరిహద్దుల నుంచి.. షెల్లింగ్ దాడులకు పాకిస్థాన్ పాల్పడుతుంది. ఇవాళ జమ్మూకాశ్మీర్లోని రాజౌరీలో కొన్ని ఇళ్లపై బాంబు దాడులు, డ్రోన్ దాడులు చేసింది. భారతిని ఎలాగైనా దెబ్బతియ్యాలనే కుట్రలతోనే పాక్ ఇవన్నీ చేస్తోంది.
ఇవాళ పాకిస్థాన్ మీటింగ్ గురించి మనం ఆందోళన చెందాలా అంటే.. చెందాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ ఆర్మీ అన్నీ చూస్తోంది. త్రివిధ దళాలు ప్రతీదీ గమనిస్తున్నాయి. అణుదాడి చేస్తే, దాన్ని అడ్డుకునేందుకు కూడా భారత్ సిద్ధంగా ఉంది. కాబట్టి.. టెన్షన్ అవసరం లేదు. ఒకవేళ పాకిస్థాన్ ఆ నిర్ణయానికి వస్తే.. ప్రపంచ దేశాలు ఊరుకోవు. కచ్చితంగా అడ్డుకుంటాయి. ఎందుకంటే.. ఇండియాకి రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాల సపోర్ట్ ఉంది. ఆ దేశాలేవీ పాకిస్థాన్ చర్యలను చూస్తూ ఊరుకోవు. అందువల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుంటే, పాకిస్థాన్ మరింత పెద్ద తప్పు చేసినట్లు అవుతుంది.