
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇండియా పర్యటనలో ఉన్నటువంటి మెస్సి కోల్కతా మరియు హైదరాబాద్ వంటి రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అయితే ఎక్కడ కూడా ఫుట్బాల్ ఆడినట్లు కనిపించలేదు. దీంతో పూర్తిగా నిరాశలో ఫ్యాన్స్ ఉండగా అసలు ఎందుకు ఇలా చేశారు అని చాలామంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వేళ తాజాగా ఒక విషయం బయటపడింది. అదేంటంటే.. మెస్సి ఎడమ కాలుకు 8000 కోట్ల రూపాయలు విలువ చేసే ఇన్సూరెన్స్ ఉందట. ఈ నేపథ్యంలోనే మెస్సి తన దేశం తరఫున లేదా ఏదైనా ఫ్రాంచైజీ లీగ్ మ్యాచ్లలో ఆడిన సమయాల్లో మాత్రమే తన కాలికి ఏమైనా అయితే ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఇక మిగతా ఏ మ్యాచ్ ఆడినప్పుడు తన కాలికి ఏమన్నా అయితే ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తించదు.
Read also : రెండు విడతల్లో హవా కొనసాగించిన కాంగ్రెస్ అభ్యర్థులు..!
కాబట్టి అందుకే అతను ఇలాంటి ఏవైనా ఎగ్జిబిషన్ మ్యాచ్లు జరిగినప్పుడు పూర్తిస్థాయిలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం లేదు అని సమాచారం. కాబట్టి ఇప్పుడు మన దేశ పర్యటనలో ఉన్న మెస్సి అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తిస్థాయిలో ఫుట్బాల్ అయితే ఆడడం లేదు. ఇప్పటికే మెస్సి ఫుట్బాల్ ఆటను చూడాలి అని ఫ్యాన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూశారు. కానీ చివరికి ప్రతి ఒక్కరికి కూడా నిరాశ ఎదురయింది. కొన్ని వేల రూపాయలను ఖర్చుపెట్టి మరి టికెట్లు కొనుగోలు చేసి స్టేడియానికి వచ్చిన వారికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాజాగా కోల్కతాలో కూడా విఐపి పర్సన్స్ అందరూ కూడా మెస్సిని ఫొటోస్ తీసుకోవడానికి తన చుట్టూ చేరడంతో అతినిని చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకులకు మెస్సి కనిపించకపోవడంతో తారాస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా స్టేడియంలో ఉన్నటువంటి కుర్చీలను మైదానంలోకి విసిరి వేశారు. ఎన్నో అవాంఛనీయ ఘటనలు కూడా ఈ సందర్భంలో చోటు చేసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.
Read also : ఎన్నో విమర్శలు వస్తున్న వేల.. స్టార్ ప్లేయర్లకు మద్దతుగా నిలిచిన అభిషేక్ శర్మ!





