Sunday, March 22, 2026
Homeతెలంగాణకోమటిరెడ్డి సైడ్ అయ్యారా..? సైడ్ చేశారా..?

కోమటిరెడ్డి సైడ్ అయ్యారా..? సైడ్ చేశారా..?

*గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి గైర్హాజరు
* హైదరాబాదులో ఉండి కూడా ముఖం చాటేసిన సినిమాటోగ్రఫీ మంత్రి
* డిప్యూటీ సీఎం హవా నచ్చకే?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తితో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ ఆయనను సైడ్ చేస్తుందా? లేకుంటే ఆయనే సైడ్ అవుతున్నారా? మొన్నటి గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం లో ఆయన ఎందుకు కనిపించలేదు? హైదరాబాదులో అందుబాటులో ఉన్న ఎందుకు హాజరు కాలేదు? ప్రోటోకాల్ ప్రకారం సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న ఆయన కార్యక్రమానికి ఎందుకు రాలేదు? తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఉగాది నాడు రవీంద్రభారతిలో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరయ్యారు. కానీ ప్రోటోకాల్ ప్రకారం సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాకపోవడం మాత్రం కొత్త చర్చకు దారితీస్తోంది.

స్థానికంగా ఉన్నా..
హైదరాబాదులో అందుబాటులో ఉండి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాకపోవడం పై అనేక రకాల చర్చ నడుస్తోంది. ఆహ్వాన పత్రిక విషయంలో తన ప్రాధాన్యత తగ్గించడం పైనే ఆయన అసంతృప్తికి గురైనట్లు ప్రచారం నడుస్తోంది. సినిమాటోగ్రఫీ మంత్రిగా ముఖ్య అతిథిగా తన పేరు ఉండాల్సిన చోట.. కేవలం అతిథిగా మార్చడం పైనే ఆయన అసంతృప్తికి లోనట్టు సమాచారం. పైగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రాధాన్యం ఇవ్వడంపై కూడా ఆయన ఆవేదనతో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ఇటీవల సినీ వ్యవహారాలన్నీ డిప్యూటీ సీఎం చాంబర్ నుంచి జరుగుతుండడం పై కూడా ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తనకంటే ఎక్కువగా డిప్యూటీ సీఎంనే సంప్రదిస్తుండడంపై కూడా కోమటిరెడ్డి కీనుక వహించినట్లు తెలుస్తోంది. కేవలం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన శాఖ విషయంలో మితిమీరిన జోక్యం చేసుకోవడానికి తట్టుకోలేక కార్యక్రమానికి గైర్హాజరైనట్లు తెలుస్తోంది.

సీనియర్ మోస్ట్ లీడర్..
కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ మోస్ట్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉమ్మడి నల్గొండలో మంచి పట్టున్న నాయకుడు కూడా. అయితే అటువంటి నేతను కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. గడిచిన మూడేళ్ల కాలంలో వెంకటరెడ్డి చుట్టూ అనేక రకాల వివాదాలు చుట్టుముట్టాయి. మొన్న మధ్యన ఓ మహిళ అధికారిని విషయంలో సైతం తప్పుడు ప్రచారం చేశారు. ఆ సమయంలో చాలా బాధపడ్డారు వెంకట్ రెడ్డి. ఇక రాజకీయాలు చేయను అన్నంత స్థితికి వచ్చేసారు. అయితే డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్కతో ఆయనకు కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ప్రచారం ఉంది. తన రాజకీయ ప్రత్యర్థులతో సన్నిహితంగా మెలుగుతున్నారన్న ఆవేదన కూడా ఉంది. మరోవైపు త్వరలో మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి తొలగిస్తారు అన్న ప్రచారం కూడా తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఉంది. ఈ కారణాలతోనే ఆయన అసంతృప్తితో ఉన్నారని.. అందుకే తన సొంత శాఖలో జరిగిన కార్యక్రమానికి హాజరు కాలేదని ప్రచారంలో ఉంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments