
చండూరు,క్రైమ్ మిర్రర్:-బంగారుగడ్డలోని మంజీత్ కాటన్ మిల్లులో దళారులు తెచ్చిన పత్తికి ఎలాంటి వంక పెట్టకుండా కొనుగోలు చేస్తున్నారని అదే రైతులు తీసుకొచ్చిన పత్తి బాలేదంటూ వంకలు పెడుతూ కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్లాట్ బుక్ చేసుకొని వెళ్లిన కొనుగోలు సకాలంలో జరగడంలేదని రైతులు చెప్తున్నారు. స్లాట్ టైం ముగిస్తే మళ్లీ పడిగాపులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి 20 ట్రాక్టర్ల వరకు లోపలికి అనుమతి పత్తి బాగోలేదని సగం సగం వరకే పత్తి కొనుగోలు చేశారు. దీంతో రైతుల్లో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వర్షాలు అంతటా ఒకేలా పడ్డాయని… పత్తి అందరిదీ ఒకేలా ఉంటుందని కొందరికి కొనడం ఏంది కొందరికి కొనక పోవడం ఏందని రైతులు ప్రశ్నిస్తున్నారు. బంగారుగడ్డ పత్తి మిల్లు వద్ద రైతుల ఆందోళనలు నిత్యకృతంగా మారాయి. దీనిపైన ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read also : ఈ కార్యాలయంలో అంతా ‘తాత్కాలికమే’..!
Read also : జగిత్యాల జిల్లాలో ఘోరం: ప్రేమ జంటపై దాడి, అమ్మాయి కిడ్నాప్..!





