
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఆసియా కప్ లో భాగంగా నిన్న రాత్రి యూఏఈ మరియు భారత్ మధ్య T20 మ్యాచ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత్ స్టార్ బౌలర్ బుమ్రా ను ఆడించడం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే యూఏఈ తో మ్యాచ్ అంటే భారత్ కచ్చితంగా గెలుస్తుంది. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. చిన్న జట్టుపై భారత్ గెలవడం చాలా సులభం. యూఏఈ లాంటి చిన్న జట్టుపై భారత్ మ్యాచ్ గెలవడం 100% పక్కా అని ప్రతి ఒక్కరు అంటారు. అలాంటప్పుడు ఇలాంటి పసికూన జట్టుపై స్టార్ బౌలర్ బుమ్రా కు రెస్ట్ ఇవ్వొచ్చు కదా అని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ లాంటి పెద్ద జట్లు మ్యాచ్ లాడుతున్న సమయంలో బుమ్రాకి రెస్ట్ ఇచ్చి పసికూన జట్టు అయినటువంటి యూఏఈ పై బరిలో దించడం ఏంటని పలువురు నెటిజనులు బీసీసీఐ ను ప్రశ్నిస్తున్నారు.
Read also : అసెంబ్లీకి రాకుండా రప్పా రప్పా అంటూ రంకెలేస్తున్నారు : సీఎం చంద్రబాబు
ఇలాంటి చిన్న టీం పై ఆడుతున్న సమయంలో స్టార్ బౌలర్లకు విశ్రాంతి ఇచ్చి.. అతడి ప్లేసులో యంగ్ బౌలర్లకు అవకాశం ఇస్తే వాళ్లు కూడా వాళ్ళ టాలెంట్ ను నిరూపించుకునే అవకాశం దక్కుతుందని పలువురు వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుపుతున్నారు. అయితే నిన్నటి మ్యాచ్ లో బుమ్రా 3 ఓవర్లు వేసి 19 రన్స్ ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు బుమ్రా కు విశ్రాంతి ఇస్తే బాగుండేదని… మరి కొంతమంది రాబోయే మ్యాచ్లో ఆడాలంటే ముందుగా ప్రాక్టీస్ ఉండాలి కాబట్టి.. యూఏఈ పై బుమ్రా ను ఆడించడం మంచిదే అని సపోర్ట్ చేస్తున్నారు. కాగా నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 13.1 ఓవర్లకే 57 పరుగులకే ఆలౌట్ అయింది. 58 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 4.3 ఓవర్లకే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. కాగా కుల్దీప్ యాదవ్ 4, శివం దూబే మూడు వికెట్లు తీయడంతో యూఏఈ జట్టు వెంటనే ఆల్ అవుట్ అయింది. దీంతో చేదన భారత్ కు చాలా సులభం అయ్యింది.
Read also : కాళేశ్వరం కనుమరుగు.. ప్రాణహిత-చేవెళ్లకే పట్టం..!