
Telangana News: కృష్ణా వాటర్ వార్.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటే.. అది కేసీఆర్ పాపమే అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శిస్తుంటే.. కాదు కాదు… కాంగ్రెస్‌దే అసమర్థ పాలన అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్ పాపాల ఫలితమే.. తెలంగాణకు నీటి కష్టాలంటూ ఓ రేంజ్లో ఫైరవుతున్నారు మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్.
మొన్న అసెంబ్లీ, నిన్న స్టేషన్ ఘన్పూర్ సభ… వేదిక ఏదైనా ప్రతిపక్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన విమర్శల్లో కృష్ణా జలాల ప్రస్తావన వచ్చింది. కేసీఆర్ పుణ్యమా అని… తెలంగాణ రావాల్సిన వాటా రావడం లేదని అన్నారు ముఖ్యమంత్రి. అంతేకాదు.. ఈ విషయంలో చర్చకు సిద్ధమన్న మాజీ మంత్రి హరీష్‌రావు సవాల్‌ను కూడా స్వీకరించారాయన. కానీ… పిల్లకాకులతో తనకు పనిలేదని… కేసీఆర్ వస్తే చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. ఏ ప్రాజెక్టుపై అయినా సరే చర్చిద్దాం రండి అంటూ… సవాల్ చేశారు.
Read More : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రెండేళ్లలో అమరావతి నిర్మాణం!
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నీళ్లను తరలించుకు పోయిన తర్వాత… అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తీరిగ్గా టెలీమెట్రీల గురించి మాట్లాడుతుందని దుమ్మెత్తిపోశారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నా ఒడిసిపల్లే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలన ఫలితంగానే.. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు వాటా తేలకపోవడానికి కారణమని నిందించారు.
Read More : కేసీఆర్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి – జగన్‌కు కూడా వర్తిస్తుందా..?
కాళేశ్వరంపై విమర్శలను కూడా తిప్పికొట్టారు కేటీఆర్. పదేళ్ల పాలనలో కేసీఆర్ కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను వేగంగా పూర్తిచేసి వందల టీఎంసీలను ఒడిసిపెట్టేందుకు రిజర్వాయర్లు నిర్మించారన్నారు. కుంగిన కాళేశ్వరం పిల్లర్లను చూపించి మరమ్మతులు చేపట్టకుండా నీళ్లను కిందకు వదిలి ఇసుకను దోచుకుంటున్నారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 50 టీఎంసీల రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నా… నీళ్లు ఎత్తిపోసుకునేందుకు నార్లాపూర్ దగ్గర నాలుగు మోటార్లు సిద్ధంగా ఉన్నా.. టెండర్లు రద్దు చేసి… 15 నెలలుగా పనులు పడావు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం… రైతుల పొలాలను ఎండబెట్టి ఇసుక వ్యాపారం చేస్తోందని ఆరోపించారు కేటీఆర్. అన్నం పెట్టే అన్నదాతకు సున్నంపెట్టి… అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలను నిలువునా మోసగిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. జాగో తెలంగాణ జాగో అంటూ ట్వీట్ పెట్టారు కేటీఆర్.
ఇవి కూడా చదవండి …
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు ముగ్గరు మృతి!
-
మూడు రోజుల్లోనే 24 కోట్లు సంపాదించిన “కోర్ట్ ”
-
కెసిఆర్ జాతిపిత… రేవంత్ రెడ్డి బూతు పిత: హరీష్ రావు ..
-
ఈనెల 21 నుంచి వర్షాలు.. వాతావరణ శాఖ గుడ్ న్యూస్
-
సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యమ జర్నలిస్టుల వార్నింగ్
-
తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ రచ్చే.. మూడు కీలక బిల్లులు