
-
హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది.
-
బీఆర్‌ఎస్‌కు బలం ఉన్నా… అభ్యర్థిని బరిలోకి దింపేందుకు వెనకడుగు..!
-
కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్ రెండు పార్టీలు ఎంఐఎంకే మద్దతు..!
-
ఎంఐఎం బీఆర్‌ఎస్‌కు పాత్ర నేస్తం…
-
ఎంఐఎంకు గోల్డెన్ ఛాన్స్ దక్కినట్టు అయ్యింది.
-
ఎంఐఎం అభ్యర్థి మీర్జా రెహమత్ బేగ్.. ఏకగ్రీవం అయ్యే అవకాశాలు
తెలంగాణలో మరో ఎన్నిక జరగబోతోంది. అదే హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక. ఏప్రిల్ 23వ జరగాల్సిన ఈ ఎన్నికకు… నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 4వ తేదీ వరకే గడువు. కానీ.. పోటీకి మాత్రం ప్రధాన పార్టీలు ముందుకు రావడంలేదు. బలం ఉన్నా బరిలోకి దిగేందుకు ఆలోచిస్తున్నాయి. ఎంఐఎం మాత్రమే పోటీకి దిగుతోంది. దీంతో… ఎంఐఎం అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్‌లో బలం లేదు. బీఆర్‌ఎస్‌కు బలం ఉన్నా… అభ్యర్థిని బరిలోకి దింపేందుకు వెనకా ముందు ఆలోచిస్తోంది. అంతేకాదు… అటు కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్ రెండు పార్టీలు ఎంఐఎంకే మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. అధికారంలో ఏ పార్టీ ఉంటే… ఆ పార్టీకి ఎంఐఎం మిత్రపక్షం అయిపోతుంది. ఆ లెక్క.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక.. కాంగ్రెస్‌కు ఎంఐఎం మిత్రపక్షం. అందుకే.. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎంకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోంది. కాంగ్రెస్ సంగతి సరే బలం లేదు, మిత్రపక్షం బరిలో ఉందని కనుక సపోర్ట్ చేస్తోంది.
మరి బీఆర్‌ఎస్‌కు ఏమైంది…? అభ్యర్థిని బరిలోకి దింపకుండా ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని ఎందుకు ఆలోచిస్తోంది..? అంటే దానికీ ఓ లెక్క ఉందంటోంది గులాబీ దళం. ఎంఐఎంకు పోటీగా అభ్యర్థిని పెట్టి.. ఆ పార్టీతో తలపడటం ఎందుకని.. బీఆర్‌ఎస్ ఆలోచిస్తోంది. ఎంఐఎం బీఆర్‌ఎస్‌కు పాత్ర నేస్తం… వచ్చే ఎన్నికల్లో అధికారంలో వస్తే.. మళ్లీ దోస్తీ కొనసాగుతుంది. కనుక… ఎంఐఎంకు పోటీగా అభ్యర్థిని పెట్టడం ఎందుకని… గులాబీ పార్టీ గుంభనంగా ఉండిపోతోంది.
Also Read : రేవంత్‌రెడ్డికి తిరుగులేదు, కేసీఆర్ మహర్జాతకుడు – తెలంగాణ పొలిటికల్ పంచాంగం..!
హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం ఓట్లు 110. అందులో కార్పొరేటర్లు 81, ఎక్స్‌అఫిషియో సభ్యులు 29 ఉన్నారు. 2020 డిసెంబర్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 56 స్థానాలు గెలుచుకుంది. బీజేపీకి 48, ఎంఐఎంకు 44 స్థానాలు రాగా.. కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితం అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక… మేయర్ విజయలక్ష్మీ ఆ పార్టీలోకి జంప్ అయ్యారు. ఆమెతోపాటు కొందరు బీజేపీ, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, బీఆర్‌ఆర్ కూడా…. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో… ఎంఐఎంకు గోల్డెన్ ఛాన్స్ దక్కినట్టు అయ్యింది. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రెహమత్ బేగ్.. ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.