
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎన్నో వార్తలు వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. విజయ్ దేవరకొండ రష్మిక మందన ఇద్దరూ కలిసి మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నామని అయితే ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు అయితే వీరిద్దరూ కొద్ది మంది కుటుంబ సభ్యులతో నిశ్చితార్థం చేసుకున్నారు అన్న వార్తలు అయితే గట్టిగానే వచ్చాయి. తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఈవెంట్లో పాల్గొన్న రష్మిక మందన కు అక్కడే ఉన్నటువంటి ఓ అభిమాని ఆసక్తికరమైన ప్రశ్నను వేశారు. విజయ్ దేవరకొండ తో మీరు నిజంగానే నిశ్చితార్థం చేసుకున్నారా?.. ఈ నిశ్చితార్థంపై ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని ఓ అభిమాని కోరగా… రష్మిక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. అసలు ఈ విషయం గురించి మీకు ఏమనిపిస్తుంది?.. ఆ విషయాన్ని ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తాను అంటూ.. మీకేమనిపిస్తుందో అదే నిజమేలే అని హీరోయిన్ రష్మిక సమాధానం ఇచ్చారు. దీంతో ఆ ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న వారందరూ కూడా ఇది నిజమే అని, వీరు రియల్ జోడి అంటూ అరుపులతో హోరెత్తించారు. రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండ త్వరలోనే వీరిద్దరి నిశ్చితార్థం గురించి మంచి శుభవార్త చెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి వీరిద్దరి జోడి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి
Read also : రేపే IND vs AUS మ్యాచ్.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు!
Read also : తెలంగాణలో దంచి కొట్టనున్న వర్షాలు.. జరభద్రం!





