
చండూరు, క్రైమ్ మిర్రర్:- చండూరు మండలం,పుల్లెంల గ్రామానికి చెందిన వెంకట్ రామ్ రెడ్డి అలియాస్ టామ్ రెడ్డి ఇప్పుడు చండూరు రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఎటైనా మారవచ్చు. మొదటినుంచి అభ్యర్థిగా అనుకుంటున్న ప్రధాన నాయకుడు ఒకవేళ పక్క పార్టీలోకి జంపు అయినా…. లేదా బరిలో నిలపాలనకుంటున్న అభ్యర్థులకు ప్రజల్లో మైలేజీ లేదని తేలిన వెంటనే రిక్రూట్మెంట్ కి కనుచూపుమేరలో కనపడే ఆప్షన్ నాయకుడే టామ్ రెడ్డి. ఈయన ఎంబీఏ చదివి అమెరికాలో ఐదేళ్లపాటు వ్యాపారం చేసి వచ్చారు. పుట్టిన ప్రాంతంపై ఉన్న మమకారంతో గత రెండేళ్లుగా నియోజకవర్గంలో తిరుగుతూ టిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. పేద విద్యార్థులకు ఇప్పటికే అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని తనకు ఉన్నంతలో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లుగా ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు సిద్దమా అని? క్రైమ్ మిర్రర్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ప్రజలు కోరుకుంటే తప్పక ఆలోచిస్తానని ఆయన తెలిపారు. అంటే ఆయన జడ్పిటిసి రేస్ లో ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. మరి చూడాలి రానున్న ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారో.
Read also : రాత్రి బంద్.. పగలు ఫుల్.. శ్రీ వివేకానంద నగర్‌లో వీధి లైట్ల వింత.. పట్టించుకోని బస్తీ నేతలు
Read also : గట్టుప్పలలో రేసుగుర్రాల వేట.. సమరంలో నిలిచే అభ్యర్థుల పట్ల సర్వత్ర చర్చ!