
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు పర్యటించడం పై ఈసీ తీవ్రంగా మండిపడింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య మరియు రామచంద్రనాయక్ పోలింగ్ బూత్ల వద్ద పర్యటించారు. వారిద్దరితోపాటుగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కూడా పోలింగ్ బూత్ ల వద్దకు రావడం పై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరందరూ కూడా ఓటర్లను ప్రభావితం చేసేలా చుట్టుపక్కల తిరుగుతున్నారు అంటూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించింది. ఇక మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా వెంకటగిరిలో కుటుంబ సభ్యులతో పాటు వచ్చి ఓటు వేయడం జరిగింది. నిన్న మొన్నటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో విస్తృతస్థాయిలో ప్రచారం చేసిన నాయకులు ప్రస్తుతం ఈ ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అని ఆలోచిస్తూ కూర్చున్నారు. అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య విస్తృతస్థాయిలో ప్రచార వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కచ్చితంగా మేమే గెలుస్తామంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గపు ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
Read also : రైతులకు శుభవార్త త్వరలో ఖాతాల్లోకి డబ్బులు జమ
Read also : బాంబు ఘటనకు పాల్పడేవారు ఊపిరి పీల్చుకునే లోపు లేపేస్తాం : బీజేపీ





