
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 9 చాలా ఘనంగా ప్రారంభమైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బిగ్ బాస్ లో ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయని నాగార్జున చెప్పారు. అన్నట్లుగానే ఈసారి సెలబ్రిటీస్ తో పాటుగా కామనర్స్ ను కూడా తీసుకువచ్చి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించారు. అయితే తాజాగా ఈ బిగ్ బాస్ ప్రేక్షకులను మోసం చేస్తుందన్న విషయం తెరపైకి వచ్చింది. ప్రేక్షకులు వేస్తున్నటువంటి ఓట్లు మొత్తం కూడా అబద్ధమే అంటూ తాజాగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఓటింగ్ వేరే ఉంటే… బిగ్బాస్ వాళ్లకు కావాల్సిన వారినే విన్నర్లుగా చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. గత మూడు సీజన్లుగా ఇదే జరుగుతుంది అని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
Read also : అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?
బిగ్బాస్ హౌస్ లోకి వచ్చిన వారిలో టాప్ ఫైవ్ కి ఎవరిని తీసుకురావాలి అనేది బిగ్బాస్ చేతిలోనే ఉంటుందని అంటున్నారు. ఇది తెలియక పాపం ప్రేక్షకులంతా కూడా రియాల్టీ షో కదా తాము ఓట్లు వేసిన వాళ్ళు గెలుస్తారని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కానీ బిగ్ బాస్ మైండ్ గేమ్ వేరే ఉంటుందని ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ లో ఎక్కువగా స్టార్ మా అలాగే హాట్ స్టార్ సీరియల్స్, షోలలో నటించే వారికి ఎక్కువగా ప్రియార్టీ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. గత సీజన్లో నిఖిల్ ను విన్నర్ చేయడానికి కూడా ఇదే కారణమని అంటున్నారు. నిజానికి అతను ఒక తెలుగు వ్యక్తి కాదు. కర్ణాటకకు చెందిన నిఖిల్ వాస్తవానికి గౌతమ్ కంటే తక్కువ ఓట్లు వచ్చిన కూడా నిఖిల్నే విన్నర్ చేశారని ప్రతి ఒక్కరు ఆరోపిస్తున్నారు. ఇతర సీరియల్స్ లో నటించే వ్యక్తులు ఎవరైనా బిగ్ బాస్ లో ఉంటే వారిని నెగటివ్ గా చూపిస్తూ ఓటింగ్ తగ్గేలా షూట్ చేస్తున్నారని చెప్తున్నారు. అందుకే ఆన్లైన్ ఓటింగ్ లో కూడా ఓట్లను తారుమారు చేస్తూ వారికి కావాల్సిన వారిని సేవ్ చేసుకొని మిగతా వారిని ఎలిమినేట్ చేస్తూ వస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతి ఆదివారం నాగర్జున ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేస్తూ ఉన్నారు కానీ ఒక్కొక్కరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది చూపించట్లేదని చెప్తున్నారు. పేరుకే రియాలిటీ షో అయిన ఏది కూడా రియల్ గా చూయించట్లేదని ఫాన్స్ బిగ్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రంగాలలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తులను తీసుకురాకుండా.. సోషల్ మీడియాలో బూతులు తిట్టిన వారిని బిగ్ బాస్ లోకి తీసుకురావడం ఏంటని… వీరి వల్ల సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారనేది తెలియజేయాలని షోపై కొంతమంది పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు పెడుతున్నారు.
Read also : అధికారంలోకి వస్తే కేతిరెడ్డి 3.O ను చూస్తారు అంటూ కూటమికి హెచ్చరికలు?