క్రీడలు

ఐపీఎల్ నుండి ఇర్ఫాన్ పఠాన్ బ్యాన్!.. కారణమేంటంటే?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 2025, 18వ సీజన్ ఘనంగా ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే కోల్కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్ లో కేకేఆర్ మరియు ఆర్సిబి తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. అయితే మొదటి మ్యాచ్ లో కామెంటేటర్, మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఎక్కడ కూడా కనిపించలేదు. ఇర్ఫాన్ పఠాన్ పై ఐపీఎల్ కమిటీ
ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పై వేటు వేసింది. కామెంటరీ ప్యానెల్ నుంచి ఇర్ఫాన్ పఠాన్ ను తప్పిస్తున్నట్లుగా ప్రకటించింది. శుక్రవారం నాడు ప్రకటించిన కామెంటార్స్ లిస్టులో ఇర్ఫాన్ పఠాన్ పేరు లేదు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు

ఐపీఎల్ నిర్వహిస్తున్నప్పటి నుంచి పలు సీజన్లలో ఇర్ఫాన్ పఠాన్ కామెంటేటర్ గా వ్యవహరించారు. కాగా కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ పై కావాలని ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ చేస్తున్నట్లు కమిటీకి ఫిర్యాదులు రావడంతో అతన్ని కామెంటేటర్ ప్యానల్ నుంచి తొలగించినట్లుగా సమాచారం అందింది. అయితే కామెంట్రీ నుంచి ఇర్ఫాన్ పటాన్ ను తొలగించిన వెంటనే అతను ఒక యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించడం జరిగింది. మైక్ ఆన్….ఫిల్టర్ ఆఫ్… ఇర్ఫాన్ తో నేరుగా మాట్లాడుదాం.. నిజాలే మాట్లాడదాం అంటూ తన యూట్యూబ్ ఛానల్ గురించి సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ వచ్చాడు. ఇర్ఫాన్ పఠాన్ ఛానల్ సోషల్ మీడియా అయినటువంటి ఇన్స్టా, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లో అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. మరి కామెంటేటర్ నుండి పఠాన్ ను ఎందుకు తొలగించారో అనే విషయం చెప్పలేదు.

జులైలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు – ఆ తర్వాత స్థానిక సంస్థలకు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button