
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి అనే కార్యక్రమంలో భాగంగా నిన్న ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వకుండా రాష్ట్రపతి పై ప్రధాని మోడీ అలాగే అమిత్ షా ఒత్తిడి చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. విద్య పరంగా, ఉద్యోగాలపరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. అందుకుగాను ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీలు అందరం కూడా ఢిల్లీకి బయలుదేరి వచ్చాము. కానీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాతో పాటుగా రాహుల్ గాంధీ ప్రో OBC అని అన్నారు. ఇక మోడీ కొంతమంది నాయకులు యాంటీ ఓబీసీ అని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే నరేంద్ర మోడీని ఓడిస్తామని అన్నారు. అలా కూడా జరగకపోతే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి బీసీలకు రిజర్వేషన్లు సాధించుకుంటామని మీడియా వేదికగా రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్లో వెంటనే దీనిపై మరోసారి చర్చ జరిపి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీలకు రిజర్వేషన్లు కల్పించేంతవరకు కూడా పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. దీనిని అంత సులభంగా తీసివేయబోమని తెలిపారు.
Read also : మిస్టర్ రెడ్డి.. నోరు మూసుకో.. కిషన్ రెడ్డి ఉగ్రరూపం
Read also: తీన్మార్ మల్లన్నతో ములాఖత్.. రాజగోపాల్ రెడ్డిపై వేటు?