Saturday, March 28, 2026
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ.. ఇరాన్ లో విమాన రాకపోకలు ప్రారంభం!

ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ.. ఇరాన్ లో విమాన రాకపోకలు ప్రారంభం!

Iran Reopens Airspace: ఇజ్రాయెల్ తో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇరు దేశాలు కాల్పుల విరమణకు కట్టబడి ఉండటంతో దాడులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తన తూర్పు ప్రాంతంలో ఎయిర్ స్పేస్ ను తిరిగి ఓపెన్ చేసింది. ఇజ్రాయెల్ తో 12 రోజుల దాడుల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ స్పేస్ ను తిరిగి తెరవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు ప్రారంభించడంతో ఇరాన్ తన ఎయిర్ స్పేస్ ను మూసి వేసింది. ఇజ్రాయెల్ మీద ప్రతి దాడులకు దిగింది. అమెరికా, ఖతార్ దేశాల జోక్యంతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం 24 గంటల తర్వాత అమల్లోకి వచ్చింది.

ఇజ్రాయెల్ దాడి చేసిన ఎయిర్ పోర్టు నుంచే..

ఇరాన్ ప్రభుత్వ ఛానెల తమ దేశంలోని తూర్పు ప్రాంతంలో విమాన రాకపోకలకు సంబంధించి గగనతలాన్ని ఓపెన్ చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆ దేశ రవాణా మంత్రిత్వశాఖ ప్రతినిధి మాజిద్ అఖావన్ అధికారికంగా వెల్లడించారు. తూర్పు ప్రాంతంలో అంతర్జాతీయ, దేశీయ విమానాల కోసం ఎయిర్‌ స్పేస్‌ ను తిరిగి తెరిచినట్లు తెలిపారు. యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ దాడి చేసిన మషద్ విమానాశ్రయం నుంచే తొలుత తమ కార్యకలాపాలను మొదలుపెట్టినట్లు వెల్లడించారు. అటు చాబహార్, జహెదాన్, జాస్క్ విమానాశ్రయాలను కూడా తిరిగి తెరిచినట్లు తెలిపారు. అయితే, ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు రకు టెహ్రాన్ సహా ఇరాన్ లోని మిగిలిన ప్రాంతాలకు విమానాలను అనుమతించబోమని తెలిపారు. వీలైనంత త్వరగా అన్ని ఎయిర్ పోర్టులలో కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు.

Read Also: ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం.. భారత్ తటస్థ వైఖరికి కారణమేంటి?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments