
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్:- రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సీట్ల భర్తీకి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు జనవరి 25 వరకు గడువు పొడిగించారు బీసీ గురుకులల్లో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మహేశ్వరం లో ఉన్నటువంటి బిసి గురుకుల మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల రాజేంద్రనగర్ తలకొండపల్లి ప్రిన్సిపల్ ఎన్ సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు గురుకులల్లో ఖాళీ సీట్లు భర్తీకి కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. అర్హత పరీక్ష ఆధారంగా విద్యార్థులకు ఎంపిక జరుగుతుందని అన్నారు. అర్హత కలిగిన బీసీ. ఎస్సీ. ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోని ఫిబ్రవరి 22 వ.తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని ప్రిన్సిపల్ ఎన్ సుధాకర్ తెలిపారు.
Read also : Cosmic Smile: నిన్న రాత్రి ఆకాశంలో ఈ అద్భుతాన్ని చూశారా?
Read also : నెల రోజులు మద్యం మానేస్తే.. మీ శరీరంలో జరిగే అద్భుతాలివే!





