Tuesday, March 17, 2026
Homeక్రైమ్ర్యాగింగ్ భూతానికి వాడిపోయిన "విద్యా"... కుసుమం..!

ర్యాగింగ్ భూతానికి వాడిపోయిన “విద్యా”… కుసుమం..!

  • ర్యాగింగ్ భూతానికి వాడిపోయిన విద్యా కుసుమం..!

  • ప‌ద్మ‌కాశీ హాస్ట‌ల్‌లో క‌ల‌క‌లం..

  • ఎలుక మందు తాగి విద్యార్థిని

  • చికిత్స పొందుతూ…..మృతి

  • విద్య‌ర్థిని మృతికి కార‌కులైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి…మృతు రాలి త‌ల్లి ఆవేద‌న‌

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ర్యాగింగ్ భూతానికి ఇంటిగ్రెటెడ్ ఎంఎస్సీ చేసే విద్యార్థిని ఎలుక‌ల మందు సేవించి ఆత్మ‌హ‌త్యా చేసుకున్న ఘ‌ట‌న వ‌రంగ‌ల్ ప‌ద్మ‌కాశీ హాస్ట‌ల్‌లో క‌ల‌క‌లం రేపింది. చ‌దువులో ముందుండే విద్యార్థిని హాస్టల్‌లో ఎలుక‌ల మందు సేవించిందంటే ఇక్క‌డ ర్యాగింగ్ ఏ స్థాయిలో ఉందో, దీనిని చూసి చూడ‌న‌ట్లు వ్యవరిస్తున్న హాస్ట‌ల్ నిర్వాహ‌కుల నిర్ల‌క్ష్యం ఏ విధంగా ఉందొ దానిపై ప‌లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

త‌ల్లిదండ్రులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఖ‌మ్మం ప‌ట్ట‌ణానికి చెందిన పి. శ్రీ‌విద్య వ‌రంగ‌ల్‌లోని కాకతీయ యూనివర్సిటిలోఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌సీ 2ఇయ‌ర్ చ‌దువుతు ప‌ద్మ‌కాశీ హాస్ట‌ల్‌లో ఉంటుంది. హాస్ట‌ల్‌లో ఉండే సీనియ‌ర్ విద్యార్థినులైన బ‌యోటెక్నాల‌జి చ‌దువుతున్న కీర్తి, ర‌మ్య‌, స్ర‌వంతి, కెమిస్టి ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న హ‌రిని, అంజ‌న‌, శ్రీ‌జ‌లు వేధించారు.

వేధింపులు భ‌రించ‌లేక తీవ్ర మ‌న‌స్తాపం చెందిన శ్రీ‌విద్య ఎలుక‌ల మందు సేవించి తీవ్ర అవ‌స్థ‌కు గురైంది. ఎలుక‌ల మందు సేవించిన విష‌యం త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌డంతో హుటాహుటీనా హాస్ట‌ల్‌కు వ‌చ్చి ఆసుప్ర‌తిలో చేర్పించారు. ఇలా ఎందుకు చేశావ‌మ్మ అని విద్యార్థిని త‌ల్లి అడుగ‌గా పైన పేర్కొన్న సీనియ‌ర్ విద్యార్థినుల వేధింపుల‌తోనే ఎలుక‌ల మందు సేవించిన‌ట్లు మాట్లాడుతూనే మృతి చెంద‌డంతో అంద‌రిని కంఠ‌త‌డిపెట్టించింది.

ఎలాగైన ఉన్న ఒకానొక కూతురిని బ్ర‌తికించుకోవాల‌ని మృతురాలి త‌ల్లి చేసిన పోరాటం ఫ‌లించ‌లేదు. చివ‌రికి వారం రోజుల పాటు ఆసుప‌త్రిలో మృత్తువుతో పోరాడుతూ కాన‌రాని లోకాల‌కు వెళ్లింద‌. చేతికొచ్చిన అమ్మాయి అర్థాంత‌రంగా త‌నువుచాలించ‌డంతో మృతురాలి త‌ల్లి, బంధువులు గుండెలు ప‌గిలేలా రోధించారు. కాగా.మృతురాలికి తండ్రి, త‌ల్లి, త‌మ్ముడు ఉన్నారు. త‌ల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

నా బిడ్డ అంతా పిరికి కాదు….

హాస్ట‌ల్ నిర్వాహ‌కుల‌పై, విద్యార్థినుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి…

అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డ‌ను. చ‌దువునే ప‌దం ఆమె పేరులోనే ఉండే విధంగా నామ‌క‌ర‌ణం చేయించుకున్నానంటూ క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తూ తెలిపారు. నా బిడ్డ ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికిది కాద‌ని ఆమె త‌ల్లి ఆరోపించారు.

నాకు నా బిడ్డ‌ను అనేక ర‌కాలుగా చిత్ర‌హింస‌లు పెట్టి ఆత్మ‌హ‌త్య చేసుకునేలా ప్రేరేపించేలా పురిగొల్పార‌ని ఆవేద‌న చెందారు. ఇంతా జ‌రుగుతున్న హాస్ట‌ల్ యాజ‌మాన్యం ఒక్క‌సారి కూడా మాకు తెలుప‌లేద‌ని తెలిపారు. హాస్ట‌ల్ యాజ‌మాన్యంపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు.

హాస్ట‌ల్‌లో ఏం జ‌రుగుతుంది…..

క‌లెక్ట‌ర్ స్థాయి అధికారుల‌చే ద‌ర్యాప్తు చేయించాలి….

ఎప్పుడో విన్న ర్యాగింగ్ ప‌దం ఇప్పుడు శ్రీ‌విద్య ఆత్మ‌హ‌త్య‌తో మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింద‌ని ప‌లువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకునేలా సీనియ‌ర్ విద్యార్థినులు జూనియ‌ర్ విద్యార్థినుల‌ను ర్యాగింగ్ చేస్తున్న యాజ‌మాన్యానికి క‌నిపించ‌డం లేదా అని ప‌లువురుప్ర‌శ్నిస్తున్నారు.

ఎన్నో ఆశ‌ల‌తో, త‌ల్లిదండ్రుల దీవెన‌ల‌తో హాస్ట‌ల్‌కు వ‌చ్చిన శ్రీ‌విద్య ఇలా విగితా జీవిగా వ‌స్తుంద‌నుకోలేద‌ని త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరుగా విల‌పించారు. ఈ ఒక్క హాస్ట‌ల్‌లోనే ర్యాగింగ్ ఉందా ఇంకా క‌ళాశాల‌లు, హాస్ట‌ల్‌లో కూడ ర్యాగింగ్ ఉందా…అనే ప‌లు ప్ర‌శ్న‌లు పిల్ల‌ల తండ్రుల‌కు లేవెనెత్తుతున్నాయి. ఇలాంటి సంఘ‌ట‌న‌లు మ‌రోసారి పున‌రావృతంకాకుండా బాధ్య‌తులైన వారిపై క‌లెక్ట‌ర్ స్థాయి అధికారుల‌చే ద‌ర్యాప్తు చేయించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments