
వరంగల్, (క్రైమ్ మిర్రర్): వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మహిళా నేతల మధ్య చిచ్చు రేగి పార్టీ లో అంతర్గత కలహాలను వెలుగులోకి తెచ్చింది.
కాశిబుగ్గలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ మహిళా నేతలు వేర్వేరు సమయాల్లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే, మంత్రి కొండా సురేఖ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వేసిన పూలమాలను కొంతమంది కార్యకర్తలు తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది.
తర్వాత మంత్రి కొండా సురేఖ స్వయంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ దృశ్యాన్ని చూసిన ఎర్రబెల్లి స్వర్ణ స్పష్టంగా అసహనం వ్యక్తం చేస్తూ మొహం చాటేసి అక్కడి నుండి వెళ్లిపోయారు.
మాజీ ప్రధాని వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ నేతలు వేరు వేరుగా నిర్వహించడం పార్టీ లోపలి విభేదాలకు సంకేతమని స్థానిక వర్గాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్‌లో తలెత్తుతున్న ఈ భిన్నాభిప్రాయాలు రాబోయే రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.
Also Read:చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో..ఐదుగురికి ఉరిశిక్ష
 
				 
					
 
						 
						




