ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంతోమందికి సహాయం చేస్తూ అందరికీ కూడా స్ఫూర్తిగా నిలబడిన రతన్ టాటా కి ఇవాళ తీవ్రమైన అస్వస్థత తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని చాలా పుకార్లు వచ్చాయి. అయితే వీటన్నిటిని ఖండిస్తూ రతన్ టాటా నా ఆరోగ్యం బాగానే ఉంది. చిన్న చిన్న చెకప్ ల కోసం హాస్పిటల్ కి వచ్చానని చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా ఊపిరిపీల్చుకున్నారు.
ప్రస్తుతం 86 ఏళ్ల వయసు ఉన్నారట ఎంతో ఆరోగ్యంగా ఉంటూ ఎప్పటికప్పుడు భవిష్యత్తులో ఎలా నడుచుకోవాలో అనే జీవిత సత్యాలు కూడా చెబుతూ ఉంటాడు. ఎంతోమందికి సహాయం చేసే గుణం ఉన్న రతన్ టాటా అంటే అందరికీ కూడా చాలా మంచి మనిషిగా అందరిలోనూ మంచి వ్యక్తిగా గుర్తింపు కూడా ఉంది. అయితే ఈ వయసులో కూడా అతను ఎంత ఆరోగ్యంగా ఉండడానికి గల కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read More : సెంచరీ కొట్టిన టమాట.. అదే దారిలో ఉల్లి.. వెల్లుల్లి
రతన్ టాటా ప్రతిరోజు కూడా అన్ని రకాల ఆహారాలనేవి అమితంగా అసలు తినడు. పరిమితికి మించకుండా అత్యధిక పోషకాలు ఉండేటువంటి ఆకుకూరలు లాంటి ఫుడ్ ని ఎక్కువగా తింటారట. అలాగే ఎక్కువ ప్రాసెస్ చేయబడినటువంటి ఫుడ్ అనేది అసలు తినడట. ప్రతిరోజు కూడా రతన్ టాటా చురుకుదనంతో అలాగే ఆనందంగా ఉండడానికి ప్రశాంతమైన వాతావరణంలో వ్యాయమాలు, చిన్న చిన్న వెయిట్ లిఫ్టింగ్ లు, మొదలగునవి చేస్తారట. ఇందువల్లే ఆయన ప్రతిరోజు కూడా చాలా చురుకుగా ఆనందంగా ఉంటాడట. అలాగే రతన్ టాటా ఇప్పుడు కూడా స్ట్రెస్ అనేది తీసుకోడట. వృత్తిపరంగా అలాగే ఫ్యామిలీ పరంగా సమతుల్యముగా డిసిసన్స్ తీసుకుంటారట. అయితే ఎప్పుడు కూడా పనిలోనే నిమిత్తం కాకుండా శరీరానికి కావలసినటువంటి విశ్రాంతిని తీసుకుంటాడని అందరూ చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో అటువృత్తి పరంగా అలాగే ఫ్యామిలీ పరంగా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ రతన్ టాటా మాత్రం వృత్తిపరంగా అలాగే ఫ్యామిలీ పరంగా సముతుల్యత పాటిస్తాడట. ప్రతిరోజు కూడా ఇలానే జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టే 86 ఏళ్ల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు.