
Interesting fact: భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి అత్యంత ఉపయోగకరమైనదిగా పరిగణించే ఆవు పాలు అనేక మంది రోజూ తీసుకుంటూ ఉంటారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇది ఉపయోగకరమని వైద్య నిపుణులు చెబుతారు. అయితే ఇటీవలి కాలంలో గాడిద పాలు మరియు ఒంటె పాలు అనే రెండు ప్రత్యేక రకాల పాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న విషయం చాలా మందికి తెలియదు. ప్రత్యేకించి గాడిద పాలు, ఒంటె పాలు ఆరోగ్య పరిరక్షణలోనే కాకుండా ఔషధ తయారీ, సౌందర్య సాధనాలు, చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ కారణంగా ఇవి ఆవు పాల కంటే అనేక రెట్లు ఖరీదైనవిగా నిలుస్తున్నాయి. గాడిద పాలు మరియు ఒంటె పాలు ఎందుకు ఇంత విలువైనవి, ఏ పాలలో ఏ ప్రయోజనాలు ఉన్నాయి, ఇవి మన ఆరోగ్యానికి ఎట్లా ఉపయోగపడతాయి అన్న విషయాలను విశ్లేషిస్తూ చూడాలి.
ప్రస్తుతం గాడిద పాలను లీటరుకు రూ.5000 నుంచి రూ.7000 వరకు విక్రయిస్తున్నారు. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ వంటి దేశాల్లో గాడిద పాలు మరింత ఖరీదుగా ఉంటాయి. అక్కడ లీటరుకు దాదాపు రూ.13,000 వరకు ధర పలుకుతోంది. ఆశ్చర్యకరంగా అనిపించినా సౌందర్య ఉత్పత్తుల తయారు చేసే పెద్ద కంపెనీలు గాడిద పాలలో ఉన్న సహజ ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లను తమ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు. చర్మానికి మృదుత్వం, సహజ కాంతి, యవ్వనాన్నిచ్చే లక్షణాలు గాడిద పాలలో ఉన్నందువల్లే దీనికి అంతటి క్రేజ్ ఏర్పడింది.
బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో పనిచేస్తున్న అనేక కంపెనీలు స్థానిక రైతుల నుండి గాడిద పాలను భారీ మొత్తాలకు కొనుగోలు చేస్తున్నాయి. గాడిద పాలలో తల్లి పాలతో సరిసమానమైన గుణాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ద్రవపరిమాణం తక్కువగా, చాల పలచగా ఉండే ఈ పాలు జీర్ణక్రియకు చాలా సులభం. ఈ కారణంగా ఆవు పాలకు అలర్జీ ఉన్న వారికి ఇది ప్రత్యామ్నాయంగా చాలా మంచిదిగా భావిస్తున్నారు. శిశువులకు, ముఖ్యంగా నవజాత శిశువులకు ఇది ఎంతో ప్రయోజనకరమని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. గాడిద పాలలో ఉండే సహజ రక్షణ గుణాలు దగ్గు, జలుబు, కీళ్ల నొప్పులు, అల్సర్, చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. మధుమేహంతో బాధపడే వారికి కూడా ఇది ఉపయోగకరంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఇక ఒంటె పాలను పరిశీలిస్తే ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన పాలుగా గుర్తింపు పొందింది. ఒంటె పాలు ఆవు పాల కంటే 30 రెట్లు ఖరీదైనవి. ప్రస్తుతం భారతదేశంలో లీటరుకు రూ.2000 నుంచి రూ.2500 వరకు విక్రయిస్తున్నారు. అమెరికా, దుబాయ్, ఆఫ్రికా దేశాల్లో ఇది మరింత డిమాండ్ ఉన్న పానీయం. ఒంటె పాలలో సంతృప్త కొవ్వు చాలా తక్కువ. అంతేకాదు ఇతర పాలతో పోలిస్తే విటమిన్ సి దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరగడంలో ఒంటె పాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. పొటాషియం, మెగ్నీషియం, ఇనుము వంటి ఖనిజాల సమృద్ధి కూడా దీని ప్రత్యేకతనే చెప్పాలి.
డెంగ్యూ వంటి వైరల్ వ్యాధుల సమయంలో ఒంటె పాలను అత్యంత ముఖ్యంగా పరిగణిస్తారు. శరీరంలో ప్లేట్‌లెట్లు వేగంగా పెరుగడానికి సహాయం చేస్తుందనే నమ్మకం దీనికి మరింత డిమాండ్ తెచ్చింది. అంతేకాక శక్తిని పెంచే లక్షణాలు ఉండడం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నవారికి త్వరగా కోలుకోవడంలో ఇది తోడ్పడుతుందని స్థానిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇలా చూస్తే గాడిద పాలు అధిక ఔషధ గుణాలు, జీర్ణశక్తి, చర్మ సంరక్షణలో ప్రయోజనాలు కలిగి ఉండగా, ఒంటె పాలు శరీర రక్షణ వ్యవస్థను బలపరచడం, ప్లేట్‌లెట్లు పెరగడం వంటి ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. రెండు పాలూ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, వాటి ధరలను చూస్తే అత్యంత ఖరీదైనది గాడిద పాలు, దాని తర్వాత ఒంటె పాలు అని చెప్పాలి. రోజువారీ జీవితంలో వీటిని చాలా తక్కువ మంది మాత్రమే వినియోగించగలిగినా, ఆరోగ్యం కోసం భారీగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నవారు వీటిపై ఆసక్తి
ALSO READ: Transaction: ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చని మీకు తెలుసా?





