
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్:- తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బిల్లులు రాకపోవడానికి ప్రధాన కారణాన్ని హౌసింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. బ్యాంక్ ఖాతా వివరాలు మరియు ఆధార్ కార్డు వివరాలు సరిపోకపోవడం వల్లే చెల్లింపులు ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు.లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు వివరాలను పరిశీలించి, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. ఆధార్ – బ్యాంక్ ఖాతా లింక్ సరైన విధంగా ఉండకపోతే భవిష్యత్తులో కూడా చెల్లింపులు నిలిచిపోతాయని హెచ్చరించారు.ఇకపై చెల్లింపులు పూర్తిగా ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టం (APBS) ద్వారానే జరుగుతాయని హౌసింగ్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఈ విధానం ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుంది.
Read also : చంద్రబాబుకి ఇవే ఆఖరి ఎన్నికలు కావచ్చు.. వైఎస్ జగన్ శాపనార్ధాలు
లబ్ధిదారులు తమ బిల్లుల స్టేటస్‌ను హౌసింగ్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి సమస్యలు తలెత్తినా సంబంధిత మండల లేదా జిల్లా హౌసింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
Read also : ఏపీ కొత్త బార్ పాలసీ.. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో తెలుసా?