ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కేసీఆర్ కట్టించిన లక్షన్నర డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్నాయిగా వాటికి పెయింట్ వేసి ఇందిరమ్మ ఇండ్ల కింద మార్చేసి ఇచ్చేద్దామనే ఆలోచనలో ఉందని సమాచారం. అర్హుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు రేవంత్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా దాదాపు లక్షన్నర ఇళ్ల పంపిణీకి అవకాశం ఉంది. సొంత జాగా లేని అర్హులకు వాటి కేటాయింపు చేయలని ప్రభుత్వం భావిస్తోంది.
పేదల కోసం గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ పథకంలో చేర్చాలని నిర్ణయించింది రేవంత్ ప్రభుత్వం. నిర్మాణం పూర్తయిన ఇళ్లతోపాటు అసంపూర్తిగా ఉన్న వాటిని సిద్ధం చేసి.. ఇందిరమ్మ లబ్దిదారుల కింద అందజేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ సర్కార్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని చేపట్టింది. హైదరాబాద్ లో దాదాపు లక్షన్నర ఇండ్లు.. జిల్లాల్లో మరో రెండు లక్షల ఇండ్లు నిర్మించారు. వీటిలో దాదాపు లక్షన్నర ఇండ్లు పంపిణి చేశారు. మరో లక్షన్నర ఇండ్లు ఉన్నాయి. వాటిలో కొన్ని నిర్మాణం పూర్తై పంపిణికి సిద్దంగా ఉండగా.. మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. వీటిని పూర్తిగా కంప్లీట్ చేసి ఇందిరమ్మ పథకంలో భాగంగా పంపిణి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోందని తెలుస్తోంది.