Sunday, March 22, 2026
Homeతెలంగాణఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అభినవ్

ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అభినవ్

క్రైమ్ మిర్రర్, నిర్మల్ :- ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మండలాల వారీగా నిర్మాణాల పురోగతిని పరిశీలించి, పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నీటి పారుదల గణాంక సర్వేను త్వరగా పూర్తి చేయాలని, తహసీల్దార్లు శ్రద్ధ వహించాలని ఆదేశించారు. భూభారతి, కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్, ప్రజావాణి వంటి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, హౌసింగ్, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ను కలిసిన రాఘవేందర్ గౌడ్

మున్సిపల్ సమరానికి బీఆర్ఎస్,సీపీఐ సిద్ధం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments