Monday, March 23, 2026
Homeతెలంగాణఅర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

  • పేద‌ల వైపే కాంగ్రెస్ ప్ర‌భుత్వం
  • మంత్రి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌, క్రైం మిర్ర‌ర్ః అర్హులైన వారంద‌రికి ఇళ్లు క‌ట్టిస్తామ‌ని రాష్ట్ర ర‌వాణ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు.మంగళవారం హుస్నాబాద్‌ పట్టణంలోని ఆరేపల్లిలో నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.

గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప‌దేళ్ల‌లో పేద‌ల‌కు ఒక్క ఇల్లు మంజూరు చేయ‌లేద‌న్నారు. కాంగ్రెస్‌ వచ్చిన తరవాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లతో భరోసా కల్పించందని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు

హుస్నాబాద్‌ పట్టణం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

ఈయన వెంట సహకార సంఘం మాజీ ఛైర్మన్‌ బొలిశెట్టి శివయ్య, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు కర్ణకంటి మంజులారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కుల రాజీనామ‌…
రాయికల్‌ పట్టణ కాంగ్రెస్‌ పార్టీలో మొదటి నుంచి ఉన్న తమను కాదని పార్టీ కండువా కప్పుకోకుండా ఉన్న నూతన అభ్యర్థులకు బీఫారాలు ప్రకటించడంపై పలువురు అసంతృప్తితో ప‌లువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు తాటిపాముల మమత, యువజన కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు బత్తిని నాగరాజు తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments