
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఆస్ట్రేలియాతో జరుగుతున్నటువంటి మూడవ టి20 మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణిత 20 ఓవర్లకు 186 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ టీమ్ డేవిడ్ 74, స్టయినిస్ 64 పరుగులతో స్కోర్ బోర్డు ను ముందుకు పరుగులు పెట్టించారు. ఇక 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.3 ఓవర్లలోనే సునాయసంగా లక్ష్యాన్ని అనేది చేదించింది. ఆరంభంలో అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ అద్భుతంగా రాణించగా చివరిలో విన్నింగ్ ఇన్నింగ్స్ అయితే వాషింగ్టన్ సుందర్ అదరగొట్టారు. కేవలం 23 బంతుల్లోనే 49 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ మ్యాచ్ ను కూడా గెలిపించగలడు అని మరోసారి నిరూపించాడు. ఏది ఏమైనా కూడా ఈ మ్యాచ్ లో గెలిచిన టీమిండియా టి20 సిరీస్ ను చెరొకటి గెలిచి తర్వాత రెండు మ్యాచ్లపై కన్ను వేశారు. మరో రెండు టీ20 లు మిగిలి ఉండగా వీటిలో ఎవరైతే రెండు టి20 లో గెలుస్తారో వారే ఈ సిరీస్ ను కైవసం చేసుకోగలరు. ఇక ఆస్ట్రేలియన్ బౌలర్స్ లో నాదన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.. టీమిండియా జట్టులో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశారు.
Read also : తాజా సర్వేలు.. జూబ్లీహిల్స్ లో విజయం వీరిదే..!
Read also : తుఫాన్, తొక్కిసలాట ఘటనను పక్కద్రోవ పట్టించడానికే అరెస్టు చేశారు : జగన్





