
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఆసియా కప్ లో భాగంగా ఇప్పటివరకు భారత్ ఆడిన అన్ని మ్యాచ్లు కూడా గెలిచింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచింది. కానీ ఒక ఫీల్డింగ్ విభాగంలో మాత్రం పూర్తిగా విఫలమవుతూ వస్తుంది. దీనిపై సోషల్ మీడియాలో చాలానే చర్చ జరుగుతుంది. బ్యాటింగ్ మరియు బౌలింగ్ లో టీం ఇండియా అద్భుతంగా ఆడుతున్నా… ఫీల్డింగ్ లో మాత్రం నిరాశ పరుస్తున్నారు. ఇప్పటివరకు ఆసియా కప్ లో భాగంగా భారత్ ఆడినటువంటి ఐదు మ్యాచ్ లలో ఘన విజయం సాధించింది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ లో భాగంగా ఇప్పటివరకు భారత్ 12 క్యాచ్లు నేలపాలు చేసింది. తాజాగా ఆసియా కప్ లో ఎక్కువ క్యాచ్లు వదిలేసిన జట్లను ప్రకటించారు.
Read also : ఇచ్చిన మాట నెరవేర్చిన కూటమి.. అభ్యర్థుల ముఖాల్లో వెలుగులు!
ఇందులో అత్యధికంగా క్యాచ్లు నేలపాలు చేసిన జట్టుగా టీమిండియా 12 నిలిచింది. ఆ తర్వాత స్థానంలో హాంకాంగ్ (11), ఒమన్ (4) నిలిచాయి. ఇక ఇండియా ఇతర జట్టులకన్న ఎక్కువ క్యాచ్లు వదిలేయడంతో మనోళ్ళ కన్నా ఇతర దేశాలు బాగా ఫీల్డింగ్ చేస్తున్నారని ఫ్యాన్స్ కూడా ఒకంత దిగులు చెందుతున్నారు. ఒకవైపు బ్యాట్స్మెన్లు మరొకవైపు బౌలర్స్ రానించడంతోనే ఫీల్డింగ్ సరిగా చేయకపోయినా భారత్ అన్ని మ్యాచ్లు గెలుస్తూ వస్తుంది. ఏది ఏమైనా ఆసియా కప్ లో ఇండియా ఫైనల్ కు చేరిన కూడా ఫీల్డింగ్ పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం చాలానే ఉందని ఫాన్స్ కోరుతున్నారు.
Read also : ఆపదలో ఉన్నారా?.. ఈ ఎమర్జెన్సీ నెంబర్లు సేవ్ చేసుకోండి!