
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఆసియా కప్ 2025 లో భాగంగా భారత్ వరుస విజయాలను నమోదు చేస్తూ వస్తుంది. ఇప్పటివరకు ఆడినటువంటి అన్ని మ్యాచ్లలో విజయం సాధించింది. విజయాల జోరుతూ ఉన్న టీమిండియా రేపు జరగబోయేటువంటి ఫైనల్ మ్యాచ్ లో గెలిస్తే మరో చరిత్ర సృష్టిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆసియా కప్ లో భాగంగా ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ పరుగుల వరద కురిపిస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ లలో కలిపి ఏకంగా 300కు పైగా పరుగులు చేశారు. వరుసగా గత మూడు మ్యాచ్లలో అర్థ సెంచరీలు తన హవాని కొనసాగిస్తున్నారు. మైదానంలోకి అడుగు పెట్టిన మొదటి బంతి నుంచే సిక్స్ లు, ఫోర్లు కొడుతూ భారత క్రికెట్ అభిమానులు అందరినీ కూడా ఎగిరి గంతేసేలా చేస్తున్నాడు. అదురు, బెదురు లేకుండా ఏ బౌలర్ బంతి వేసినా కూడా తన స్టైల్ లో మొదటి బంతి నుంచే ప్రత్యర్థి జుట్టుపై విరుచుకుపడుతూ పరుగుల వర్షం కురిపిస్తున్నారు.
Read also : ట్రంప్ వల్లే యుద్ధం ఆగిపోయింది.. శాంతికి మారుపేరు ట్రంప్ : పాకిస్తాన్ ప్రధాని
యువరాజ్ స్టైల్ లో బ్యాటింగ్ చేస్తూ, సెహ్వాగ్ లాంటి స్పీడుతో ప్రతి ఒక్కరిని కూడా మైమరిపిస్తున్నాడు. రోహిత్ శర్మ లేని లోటును అభిషేక్ శర్మ స్పష్టంగా తీరుస్తున్నారు. భారత్ క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఇతను మరో రోహిత్ శర్మ అని అంటున్నారు. అభిషేక్ శర్మ ఇలాంటి దూకుడు తోనే ఆడితే మాత్రం పాకిస్తాన్ కు ఫైనల్ మ్యాచ్ లో చుక్కలే అంటున్నారు భారత అభిమానులు. ఇప్పటికే పాకిస్తాన్, భారత్ మధ్య రెండుసార్లు మ్యాచ్ జరగగా రెండింటిలోనూ భారత్ ఘన విజయం సాధించింది. ఇక రేపు ఫైనల్ మ్యాచ్ జరగనుండగా ఎవరు గెలుస్తారని ఉత్కంఠంగా ప్రతి ఒకరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రేపటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది కింద కామెంట్ చేయండి.