
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత స్టార్ మహిళా క్రికెటర్ అయినటువంటి స్మృతి మందాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. రాబోయే నవంబర్ నెలలోనే ఈ స్టైలిష్ ఓపెన ర్ అయినటువంటి స్మృతి మందానా వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు ఇప్పటికే ముహూర్తపు డేట్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. మహిళా క్రికెట్ ప్రపంచంలో ఈమె సాధించిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. తనకంటూ క్రికెట్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది స్మృతి మందాన. ఒకవైపు అందంలోనూ మరోవైపు ఆటతీరులోనూ ప్రేక్షకులను ఆహా అని అనిపిస్తుంది. ఇప్పటివరకు భారత జట్టు ఓపినర్ గా 115 వన్డే మ్యాచ్ లు ఆడగ 14 శతకాలు చేయడంతో పాటు 5253 పరుగులు చేసింది.
Read also : తుఫాన్ కారణంగా పంటలన్నీ నాశనం.. మన ప్రభుత్వమే బెటర్ : వైయస్ జగన్
ఇక తన వివాహ బంధం విషయానికి వస్తే బాలీవుడ్ కు సంబంధించినటువంటి స్టార్ సింగర్ పలాష్, స్మృతి మందన ఇద్దరు కూడా ప్రేమించుకున్నట్లు తెలుస్తుంది. పలాశ్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో మరాఠీ కుటుంబంలో జన్మించి నేడు బాలీవుడ్ లో స్టార్ సింగర్ గా ఉన్నారు. ప్రస్తుతం పలాశ్ మరియు స్మృతి మందాన ఇద్దరి మధ్య మంచి అనుబంధము ఉందని తాజాగా అతనే ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. నవంబర్ 20వ తేదీన వీరిద్దరికీ వివాహం జరగబోతుంది అన్నట్లు టైమ్స్ ఎంటర్టైన్మెంట్ తాజాగా కొన్ని వివరాలను తెలిపింది. అందులో భాగంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.
Read also : అయ్యప్ప స్వాములు అలర్ట్.. శబరిమల దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం!





