
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన దేశవ్యాప్తంగా ఎంతో మంది గుండెకు సంబంధించి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. చాలామంది కూడా హార్ట్ ఎటాక్ వల్ల క్షణాల్లోనే మృతి చెందుతున్న సందర్భాలు నిత్యం కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఎంతో సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతున్న వ్యక్తులు ఒక్కసారిగా అనుకోకుండా అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందిన సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా “ఇండియన్ హార్ట్ అసోసియేషన్” కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం చలికాలంలో గుండె జబ్బులకు సంబంధించిన వారు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి అని సూచించింది. చలికాలంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుంది అని డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ చలికాలంలోనే గుండెపోటు తీవ్రత అనేది సాధారణ రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది అని తెలిపారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వరకు ఈ చలికాలపు నెలలు ఏవైతే ఉంటాయో అప్పుడు హార్ట్ ఎటాక్ ఘటనలు 15 నుంచి 20% అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించింది. ఇక గుండె జబ్బులు, బీపీ మరియు షుగర్లు అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ ఇండియన్ హార్ట్ అసోసియేషన్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంత ఎక్కువగా ఈ చలికాలంలో ధూమపానం మరియు మద్యపానం మానేయడం హార్ట్ కు చాలా మంచిది అని సూచిస్తున్నారు.
Read also : సీఎంగా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి..!
Read also : తప్పు చేశాను.. అందుకే 90 శాతం ఆస్తి శ్రీవారికి రాసిచ్చా : నిందితుడు రవికుమార్





