క్రీడలు

బ్రిటన్‌ రాజు నివాసంలో ఇండియన్‌ క్రికెట్‌ టీమ్స్‌ సందడి

  • కింగ్‌ చార్లెస్‌ను కలిసిన మెన్స్‌, వుమెన్స్‌ టీమ్స్‌

  • లండన్‌లోని క్లారెన్స్‌ హౌస్‌లో చార్లెస్‌ను కలిసిన సభ్యులు

  • రెండు టీముల సభ్యులతో కలిసి ఫొటోలకు ఫోజులు

  • కింగ్‌ చార్లెస్‌ను కలవడం ఆనందంగా ఉందన్న గిల్

క్రైమ్‌మిర్రర్‌, స్పోర్ట్స్‌: బ్రిటన్‌ రాజు కింగ్ చార్లెస్‌ నివాసంలో భారత్‌ క్రికెట్‌ మెన్‌, వుమెన్‌ జట్ల సభ్యులు సందడి చేశారు. లండన్‌లోని క్లారెన్స్‌ హౌస్‌లో కింగ్‌ చార్లెస్‌తో ఉత్సాహంగా గడిపారు. మహిళల క్రికెట్‌ జట్టు సభ్యులు, పురుషుల క్రికెట్‌ టీమ్‌ సభ్యులతో కలిసి చార్లెస్‌ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా చార్లెస్‌ మాట్లాడుతూ లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన మూడో టెస్ట్‌ హైలైట్స్‌ను చూసినట్లు తెలిపారు. టీమిండియా పోరాటం తనకు నచ్చిందన్నారు. ఐదోరోజు త్వరగా వికెట్లు కోల్పోయినా… చివరి వరకు పోరాడి, కేవలం 22పరుగుల తేడాతో ఓటమి పాలైందన్నారు.

టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌గిల్‌ మాట్లాడుతూ కింగ్‌ చార్లెస్‌ను కలవడం అద్భుతమైన అనుభవంగా పేర్కొన్నారు. చార్లెస్‌ ఎంతో ఆత్మీయంగా, సౌమ్యంగా మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. లార్డ్స్‌ టెస్టు గురించి అడిగి తెలుసుకున్నట్లు గిల్‌ తెలిపారు. తర్వాతి రెండు టెస్టుల్లో టీమిండియా పుంజుకుటుందని, గెలుపే లక్ష్యంగా పోరాడతామని గిల్‌ ధీమా వ్యక్తం చేశారు.

ఇవి చదవండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button