క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : మహిళల తొలి ఖో ఖో వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. నేడు జరిగినటువంటి కోకో ఫైనల్ లో నేపాల్ పై భారత్ ఘనంగా గెలిచింది. నేపాల్ 40-78 ఇండియా.. 38 పాయింట్ల తేడాతో గెలిచి మహిళల ఖో ఖో వరల్డ్ కప్ తొలి విశ్వ విజేతగా నిలిచింది. ఒకవైపు చేజింగ్ మరో వైపు డిఫెన్స్ లో టీమిండియా మహిళలు పట్టు సాధించి విజయకేతనాన్ని ఎగరవేశారు. తొలిసారిగా జరిగిన ఈ ఖో ఖో వరల్డ్ కప్ ఆటలో మన భారతదేశ మహిళలు గెలవడం భారతదేశానికి మరొక గర్వకారణం అని చెప్పవచ్చు.
2025వ సంవత్సరం ప్రారంభంలోనే తొలిసారి భారతదేశ మహిళలు ఖో ఖో వరల్డ్ కప్ గెలవడం అనేది శుభ సూచికంగా మారింది. త్వరలోనే టీమిండియా క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ఆడునున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ చాంపియన్స్ ట్రోఫీ కూడా మన భారతదేశము గెలవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
1.నా కొడుకుని ఉరి తీయండి!.. ఒక ఆడపిల్లగా చెబుతున్నా?