
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య ఈరోజు నుండి టి20 సిరీస్ ప్రారంభం కానుంది. నాగపూర్ వేదికగా ఈరోజు తొలి టి20 మ్యాచ్ జరగనుంది. కాగా ఇప్పటికే వన్డే సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో టి20 సిరీస్ ను కూడా గెలిచే విధంగా విశ్వప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. మరోవైపు టీమిండియా టి20 సిరీస్ లో ఎంతో బలంగా ఉన్న విషయం తెలిసిందే. కానీ న్యూజిలాండ్ ను తక్కువ అంచనా వేయకుండా బ్యాటింగ్ మరియు బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శన కనపరిచి టి20 సిరీస్ ను కైవశం చేసుకునే దిశగా అడుగులు వేయాలి అని భావిస్తుంది. ఇప్పటివరకు స్టాట్స్ ప్రకారం ఇరుదేశాల మధ్య కూడా 8 ద్వైపాక్షిక టి20 సిరీస్ లు జరగగా అందులో భారత్ 5, న్యూజిలాండ్ మూడు గెలిచాయి. ఒకవైపు టీమ్ ఇండియా జుట్టు బలంగా కనిపిస్తున్న కూడా మరోవైపు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఫామ్ చూస్తుంటే కాస్త ఆందోళన కనిపిస్తుంది. ఈ మధ్య టి20లలో సూర్యకుమార్ యాదవ్ ఫర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు అభిషేక్ శర్మ, సంజు సాంసన్, ఇషన్ కిషన్ మంచి స్టార్ట్ ఇవ్వగలిగితే మాత్రం కచ్చితంగా గెలుపు ఇండియాదే అవుతుంది. ఇక ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి జియో హాట్స్టార్ మరియు స్టార్ స్పోర్ట్స్ లో మ్యాచ్ ను లైవ్ లో చూడవచ్చు. మరి ఈరోజు జరగబోయేటువంటి సమరంలో ఎవరు విజయం సాధిస్తారో అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. ఆలయం మళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలుసా?
Read also : Fake Certificate : పెద్దపల్లి జిల్లాలో నకిలీ స్టడీ సర్టిఫికెట్ల దందా..!





