క్రీడలు

సౌత్ ఆఫ్రికా తో భారత్ ఢీ.. కెప్టెన్, జట్టు పూర్తి వివరాలు ఇవే!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య ఈనెల 30వ తేదీ నుంచి 3 వన్డే సిరీస్ ప్రారంభం కానున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా ఇప్పటికే కెప్టెన్ గిల్ మరియు శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా దూరమయ్యారు. ఇక మరోవైపు స్టార్ బౌలర్ బుమ్రా మరియు సిరాజ్ కు ఆట ఒత్తిడి కారణంగా రెస్టు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా తో జరిగే వన్డే సిరీస్ కు భారత జట్టుకు కొత్త కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను బీసీసీఐ ప్రకటించగా.. ప్రతి ఒక్కరు కూడా ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సౌత్ ఆఫ్రికా తో తలబడే వన్డే జట్టును బీసీసీఐ తాజాగా విడుదల చేసింది.
భారత జట్టు :- రోహిత్ శర్మ, జైస్వాల్, కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ ( కెప్టెన్), రిషబ్ పంత్ (vc), జడేజా, సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా, కృషి కృష్ణ, రుతురాజ్ గైక్వాడ్, హర్షదీప్, దృవ్ జూరేల్.

చాలా రోజుల తర్వాత మళ్లీ టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్స్ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ జట్టులో చేరారు. వీరిద్దరి ఆటను మళ్లీ చూడాలని ఫాన్స్ కూడా తహతహలాడుతున్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 6వ తేదీన వైజాగ్ లో మూడవ వన్డే మ్యాచ్ జరుగునుంది. ఈ మ్యాచ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

Read also : రాజకీయ నేతల వాట్సప్ గ్రూపులు హ్యాక్.. కీలక సూచనలు చేసిన సైబర్ క్రైమ్!

Read also : హైదరాబాదులో ఘోర ప్రమాదం.. బెంబేలిస్తున్న అస్తిపంజర ఫోటోలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button