జాతీయం

భారత అమ్ముల పొదిలోకి మరో రెండు బాలిస్టిక్ మిస్సైల్!

Ballistic Missiles: భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు డీఆర్డీఓ కీలక పరిశోధనలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ 2, అగ్ని 1 పరీక్ష విజయవంతం అయింది. ఒడిశాలోని  చాందీపూర్‌ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని పరీక్షించారు. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో వీటి పరీక్ష జరిగింది. పృథ్వీ 2, అగ్ని 1 ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్‌ ను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష విజయవంతం అయినట్లు అధికారులు తెలిపారు.

పృథ్వీ 2 మిస్సైల్  గురించి..

ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. దీనిని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) అభివృద్ధి చేసింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే అవకాశం ఉంటుంది. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ దీనిని వాడుతుంది. ఈ క్షిపణి రేంజ్ 350 కిలోమీటర్లు. 500 నుంచి 1000 కేజీల వార్ హెడ్స్ ను మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది.

అగ్ని 1 మిస్సైల్ గురించి..   

ఇది కూడా షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. దీనిని కూడా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) డెవలప్ చేసింది. ఈ క్షిపణి 700 నుంచి 900 కిలోమీటర్లు రేంజ్ లోని లక్ష్యాలను చేధిస్తుంది. ఇది 1000 కేజీల వార్ హెడ్స్ ను మోసుకెళ్లే అవకాశం ఉంటుంది. తక్కువ లోడు ఉంటే ఏకంగా 1200 కిలో మీటర్లు దూసుకెళ్లే అవకాశం ఉంటుంది.

Read Also: నిమిష ప్రియ కేసు.. భారత విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్యలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button