అంతర్జాతీయం

ట్రంప్ సీరియస్ కామెంట్స్.. భారత్ కూల్ రియాక్షన్!

India Reaction On Trump Threats: భారత్, రష్యా దేశాలవి పతనమైన ఆర్థిక వ్యవస్థలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇండియా స్సందించింది. ట్రంప్ వ్యాఖ్యలపై చెప్పడానికి పెద్దగా ఏమీ లేదని వెల్లడించింది. కీలకమైన ఎజెండా పైనే తమ రెండు దేశాలు దృష్టిసారించాయన్నది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. భారత్‌ పై 25 శాతం దిగుమతి సుంకాలు విధించడంతో పాటు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడంపై  ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై.. విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ రియాక్ట్ అయ్యారు.

 భాగస్వామ్యం కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం

భారత్-అమెరికా దేశాల భాగస్వామ్యం అనేక మార్పులు, సవాళ్లను ఎదుర్కొన్నట్లు రణధీర్ వెల్డించారు. అందుకు  అనుగుణంగానే ముఖ్యమైన ఎజెండాపైనే తాము దృష్టి సారించామన్నారు. ఈ భాగస్వామ్యం ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. రక్షణ సంబంధాలలో అమెరికాతో భారత్ బలమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉందన్న ఆయన.. గత కొన్నేళ్లుగా  ఈ బంధం మరింత బలపడినట్లు చెప్పారు. ఏ రెండు దేశాల మధ్య సంబంధాలు మూడో దేశం కోణంలో చూడకూడదన్నారు. వివిధ దేశాలతో సంబంధాలు వేటికవే సొంత లక్ష్యాలను కలిగి ఉన్నాయన్నారు రణధీర్. భారత్-రష్యా  మధ్య నిలకడైన సంబంధాలు ఉన్నాయన్న ఆయన.. కాలపరీక్షకు నిలిచిన భాగస్వామ్యం తమదన్నారు.

Read Also: ట్రంప్ సుంకాల దెబ్బ.. భారత్ తో పాటు అమెరికాకూ నష్టమే!

Back to top button