
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ, అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుందని బీబీ క్యాన్సర్ అండ్ జనరల్ ఆసుపత్రి అధినేత డాక్టర్ విఖార్ సయ్యద్ అన్నారు. రోబోటిక్స్ అండ్ సెన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ను గురువారం మలక్ పేట్ లోని డాన్ హైస్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, మన దేశం 25 ఏళ్ల క్రితం నాటి ఎడ్ల బండి తోడే దేశం కాదని, అత్యాధునిక రవాణా సదుపాయాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాలతో ముందంజలో ఉందన్నారు.
నేడు మన యువతలో కనిపిస్తున్న ప్రతిభ వల్ల సాంకేతిక శాస్త్రీయ విజ్ఞాన తదితర రంగాల్లో దేశం దూసుకెళ్తోందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచం పోటీ పడుతున్న తరుణంలో అందుకు అనుగుణంగా భారతదేశం ఆ దిశలో ముందుకు సాగుతుందన్నారు. విశ్వమంతా సైన్స్ అండ్ టెక్నాలజీ పై ఆధారపడి ఉందని, ఈ తరహాలో సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు రోబోటిక్స్ పై ఎగ్జిబిషన్లు నిర్వహించడం, విద్యార్థుల ప్రతిభకు పదను కల్పించినట్లవుతుందన్నారు.
దేశ యువత సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో విశేష కృషి చేస్తుందని దీంతో దేశ ప్రతిష్ట ఈశ్వర్ వ్యాప్తంగా విస్తరిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో డాన్ విద్యాసంస్థల చైర్మన్ ఫజల్ ఉర్ రెహమాన్ ఖుర్రం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు తౌసిఫుర్ రెహమాన్, సఫీ ఉర్ రెహమాన్, బీబీ క్యాన్సర్ ఇన్ జనరల్ ఆసుపత్రి జనరల్ మేనేజర్ మొయీద్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.