ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య ఇవాళ మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఆరంభంలోనే భారీ వర్షం ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ సిటీ లో ఉన్నటువంటి గబ్బా స్టేడియంలో మ్యాచ్ జరగనుండగా వర్షం కారణంగా నిలిచిపోయింది. ఇప్పటికే మ్యాచ్ ప్రారంభం పై కామెంట్రీ వారు వివిధ రకాలుగా డౌట్లు వ్యక్తం చేశారు. మ్యాచ్ ప్రారంభమై 13 వ ఓవర్ జరుగుతుండగా రెండోసారి జల్లులు పడగా ఎంపైర్లు ఆటను నిలిపివేశారు.
ఢిల్లీలోని స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు?
భారీ వర్షం పడుతుండడంతో ఎంపైర్లు లంచ్ బ్రేక్ కూడా ఇచ్చారు. అయినా కానీ వర్షం పడుతూనే ఉండగా ఆట ఎప్పుడు మొదలవుతుందని విషయం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం గ్రౌండ్ మొత్తం కూడా వాన నీరు నిలిచిపోగా, పిచ్చును మాత్రం కవర్లతో కప్పారు. ఇక ప్రస్తుతానికి ఆస్ట్రేలియా స్కోరు 28 పరుగులు చేయగా ఒక వికెట్ కూడా పడలేదు. ఇక వర్షం పడుతూనే ఉండడం కారణంగా ఇవాల్టి మ్యాచ్ జరగకుండానే స్టంప్స్ ఇచ్చేసారు.
పరారీలో మోహన్ బాబు!…వార్తలలో నిజమెంత?
ఇక ఇప్పటికే ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య రెండు టెస్ట్ మ్యాచ్లు జరగగా టీమిండియా ఒకటి మరియు ఆస్ట్రేలియా 1 గెలిచి సరి సమానంగా ఉన్నాయి. మరి మూడో టెస్టులో ఎవరు గెలుస్తారనే ఆలోచనలో ఫ్యాన్స్ అందరూ ఉండగా ఇవాల్టి మ్యాచ్ ప్రారంభంలోనే వర్షం కారణంగా మొదటి రోజు ఆట నిలిచిపోయింది. మరి రేపైనా వర్షం కారణంగా ఆట నిలిచిపోతుందో లేదా జరుగుతుందో వేచి ఉండాల్సిందే.