
పెబ్బేరు, క్రైమ్ మిర్రర్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించేంత వరకు కాలేజీల నిరవధిక బంద్ కొనసాగుతుందని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ సెక్రటరీ జయరామయ్య అన్నారు. సోమవారం పెబ్బేరు పట్టణంలో వీరభద్ర డిగ్రీ కాలేజీ విద్యార్థుల సమక్షంలో కాలేజీ బంద్ చేశారు. జయరామయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలుగా విద్యార్థుల స్కలర్షిప్, రీయంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించకపోవడం వల్ల కళాశాల నిర్వహణ భారంగా మారిందన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించమని అడుగుతుంటే ప్రైవేటు కాలేజీలపై విజిలెన్సు దాడులు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల చదువు అర్ధాంతరంగా ఆగిపోతందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ వినోద్ కుమార్, కాలేజీ లెక్చరర్స్. విద్యార్థులు పాల్గొన్నారు.
Read also : తెల్లవారుజామున భూప్రకంపనలు.. భయపడిపోయిన వైజాగ్
Read also : పెళ్లి కట్నం వద్దంట.. కానీ 10 కండిషన్లు పెట్టేసాడు?
				
					
						




