
క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్ :- ఏపీలోని క్రికెట్ అభిమానులు అందరికీ కూడా ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్. భారత్ మరియు సౌతాఫ్రికా మధ్య జరగబోయే వన్డే మ్యాచ్లకు గాను భారత స్టార్ క్రికెటర్స్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వైజాగ్ కు రానున్నారు. ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా.. మూడవ వన్డే మ్యాచ్ ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నో రోజుల తర్వాత మళ్లీ ఈ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ గ్రౌండ్లో ఆడనున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడడానికి అవకాశం కలగడంతో టికెట్లు కొనుగోలు చేయడానికి ఇప్పటి నుంచే ఆసక్తి చూపుతున్నారు. ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లు నవంబర్ 28వ తేదీ నుంచి విక్రయించనున్నారు. డిస్ట్రిక్ట్ ఆప్ లో దాదాపు 22,000 టికెట్లు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్ననున్నాయని క్రీడ వర్గాలు పేర్కొన్నాయి. ఇక వీటి ధర 1200 నుంచి 1800 రూపాయల మధ్య ఉంటుంది అని తెలిపారు. సాధారణంగా స్టార్ ప్లేయర్స్ లేకుండా జరిగిన మ్యాచ్ కే మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆదరణ చూపిస్తూనే హంగామా చేస్తుంటారు. అలాంటిది ఒకప్పటి ఇండియన్ కెప్టెన్స్ అలాగే ఎంతోమంది అభిమానుల ఆటగాళ్లు చాలా రోజుల తర్వాత అది కూడా మన వైజాగ్ లో ఆడడంతో కచ్చితంగా ఈ మ్యాచ్ లో హంగామా మామూలుగా ఉండదు. చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ అభిమానులకు దక్కడంతో చాలా హ్యాపీగా ఉన్నారు.
Read also : మేము అనుభవించేదంతా వెంకన్న దయ వల్లే.. తప్పుగా మాట్లాడినందుకు క్షమాపణలు : యాంకర్ శివ జ్యోతి
Read also : అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం వస్తే కాల్చి చంపేస్తారా..?





