క్రీడలుజాతీయం

IND vs SA: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా.. నాలుగో టీ20 క్యాన్సిల్, కారణం ఏంటంటే?

భారత్, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ క్యాన్సిల్ అయ్యింది. కనీసం టాస్ కూడా వేయకుండానే రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఎందుకంటే..

Ind vs SA 4th t20 Cancelled: లక్నో వేదికగా భారత్ , సౌతాఫ్రికా మధ్య నిన్న(బుధవారం) జరగాల్సిన నాలుగో టీ20 రద్దు అయ్యింది. కనీసం టాస్ పడకుండానే క్యాన్సిల్ చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దట్టమైన పొగమంచు కారణంగా మ్యాచ్‌ మొదలుకాకుండానే ఆగిపోయింది.

పలుమార్లు పరిస్థితిని పర్యవేక్షించిన అంపైర్లు

లక్నో నగరంతో పాటు మ్యాచ్ జరిగే స్టేడియాన్ని పొగమంచు కమ్మేయడంతో పలుమార్లు మైదానానికి వచ్చిన అంపైర్లు.. పరిస్థితిని పర్యవేక్షించారు. ఇవాళ సాయంత్రం 6.30 నిమిషాలకు టాస్‌ పడాల్సి ఉండగా.. పొగ మంచు కారణంగా తొలుత ఆలస్యమైంది. ఈ క్రమంలో వరుస విరామాల్లో అంపైర్లు వచ్చి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా 6.50 నిమిషాలకు ఓసారి.. 7.30 నిమిషాలకు మరోసారి, 8 గంటలకు.. అనంతరం 8.30 నిమిషాలకు.. మైదానంలోకి వచ్చిన అంపైర్లు పరిస్థితిని సమీక్షించారు.ఈ క్రమంలో పిచ్‌పై కవర్లు కప్పి ఉంచాలని సూచించారు.

రాత్రి 9.25 గంటలకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన

అనంతరం 9 గంటలకు మరోసారి అప్లైరు రివ్యూ చేశారు. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుందని ప్రేక్షకులు భావించారు. ఈసారి 9.25 నిమిషాలకు మరోసారి రివ్యూ చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో… 9.25 నిమిషాలకు మరోసారి మైదానంలోకి వచ్చి పరిస్థితి పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఐదో టీ20 మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. డిసెంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button