
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:-యూఏఈ దేశంలో ఆసియా కప్ లో భాగంగా రేపు ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సాధారణంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అన్న మాట వింటే చాలు ఇరుదేశాలు కూడా చాలా ఉత్కంఠంగా ప్రవర్తిస్తుంటాయి . ఇరుదేశాల క్రికెట్ అభిమానులు అందరూ కూడా స్టేడియాలకు భారీగా క్యూ కడతారు. స్టేడియానికి వెళ్ళలేకపోయిన వారు టీవీలకు అతుక్కుని మ్యాచ్ అయిపోయే వరకు కూడా పక్కకి కదలరు. ఈ సందర్భంలోనే దాయాదుల పోరులో ఎవరు గెలుస్తారు అని ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్కంఠంగా మాచ్ ను వీక్షిస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి అసలు కనబడడం లేదు.
Read also : ప్రధాన పార్టీలకు అతనే ఆప్షన్..?
ఎందుకంటే… రేపు యూఏఈ వేదికగా జరగబోయేటువంటి ఆసియా కప్ లో పాకిస్తాన్ దేశంతో భారత్ తలపడాల్సి ఉంది. కానీ ఈ మ్యాచ్ ను వీక్షించడంలో భారత అభిమానులు కాస్త వెనక్కి తగ్గినట్లు ఉన్నారు. పాకిస్తాన్ దేశంతో భారత్ క్రికెట్ ఆడడం పట్ల అభిమానుల్లో కాస్త ఆందోళనతో పాటు ఆసక్తి కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి మ్యాచ్ ను వెంటనే బాయ్ కాట్ చేయాలని చాలా మంది భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. సాధారణంగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే ఆ మ్యాచ్ కు సంబంధించి టికెట్స్ క్షణాల్లో అమ్ముడుపోతాయి. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. రేపు జరగబోయేటువంటి మ్యాచ్ కు సగం టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయని.. మిగతా టిక్కెట్లు అసలు అమ్ముడుపోవడం లేదని సమాచారం అందింది. మిగతా సగం టికెట్లు అమ్ముడు పోవాలి అని… సగం దరకే టికెట్లు అందిస్తున్న కూడా ఎవరు ముందుకు రావట్లేదట. దీంతో టికెట్లు సేల్ అవ్వకపోవడానికి చాలానే కారణాలు ఉన్నాయని కొంతమంది క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.
Read also : రాత్రి బంద్.. పగలు ఫుల్.. శ్రీ వివేకానంద నగర్‌లో వీధి లైట్ల వింత.. పట్టించుకోని బస్తీ నేతలు
కొద్ది రోజుల క్రితం… భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్ ఆర్మీ నేల కూల్చింది. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో బలై పోవడంతో భారత ప్రజలు పాకిస్తాన్ దేశంపై తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. ఇరుదేశాల మధ్య యుద్ధం ముగిసినప్పటికీ పాకిస్తాన్ పై ఇప్పటికీ భారత ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. ఆసియా కప్ లో భాగంగా రేపు జరగబోయేటువంటి మ్యాచ్ కు సంబంధించి టికెట్లు సేల్ కాకపోవడానికి ఇదే మెయిన్ రీజన్. ఇక మరొక రీజన్ ఏంటంటే… రేపు జరగబోయే మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్లు లేకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. బహుశా ఈ రెండు కారణాల ద్వారానే ముఖ్యం గా టికెట్లు అమ్ముడు పోలేదు.