క్రీడలు

ఓవల్ టెస్టులో టీమిండియా స్టన్నింగ్ విక్టరీ, 2-2 తో సిరీస్ సమం!

ENG vs IND: ఓవల్ వేదిక‌గా ఇంగ్లండ్‌ తో జ‌రిగిన ఐదో టెస్టులో భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. 6 పరుగుల తేడాతో సంచ‌ల‌న విజ‌యం సాధించింది.  ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్‌-టెండూల్కర్‌ ట్రోఫీని 2-2తో భారత్‌ సమం చేసింది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి రోజు ఆటలో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాఫించాడు. ఇంగ్లండ్‌ విజయానికి 35 పరుగులు అవసరం కాగా, సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టి ఇం‍గ్లండ్ పతనాన్ని శాసించాడు.

ఆండర్సన్‌-టెండూల్కర్‌ సిరీస్ 2-2తో సమం

374 పరుగుల టార్గెట్ తో ఓవర్‌ నైట్ స్కోరు 339/6తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. జేమీ స్మిత్ (2), జేమీ ఒవర్టన్ (9), జోష్‌ టంగ్ (0)లను భారత బౌలర్లు త్వరగానే వెనక్కి పంపారు. అట్కిన్సన్ (17) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. మహ్మద్‌ సిరాజ్ 5, ప్రసిద్ధ్‌ కృష్ణ 4, ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌ లో భారత్ 224, ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌటయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌ లో టీమిండియా 396 పరుగులు చేసింది. దీంతో సిరీస్‌ను 2-2తో ముగించింది.

Read Also: ఓవల్‌ టెస్టులో వర్షం ట్విస్ట్.. విజయం వరించేది ఎవరినో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button