
IND vs ENG 4th Test Day 1 Highlights: ఇంగ్లండ్ తో నాలుగో టెస్ట్ లో తొలి రోజు భారత్ అద్భుతంగా రాణించింది. తొలి ఇన్నింగ్స్ లో 83 ఓవర్లలో 264/4 స్కోరు చేసింది. సాయి సుదర్శన్ (61) ఫస్ట్ హాఫ్ సెంచరీ చేయగా, యశస్వి జైస్వాల్ (58) అర్థ శతకం చేశాడు. జడేజా (19), శార్దూల్ ఠాకూర్ (19) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. రాహుల్ (46) చేసి ఔట్ కాగా, రిషభ్ పంత్ (37) గాయంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. స్టోక్స్ 2 వికెట్లు తీశాడు.
టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లాండ్
ఓల్ట్ ట్రాఫోర్డ్ లో ఇప్పటి వరకు ఎవరు టాస్ గెలిచినా తొలుత బ్యాటింగ్ చేసేవారు. కానీ, తొలిసారి టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అవకాశం ఇచ్చాడు ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్. వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. భారత ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ నెమ్మదిగా ఆడుతూ.. భారత్ కు చక్కని ఆరంభాన్ని అందించారు. లంచ్ వరకు భారత్ 78/0తో రాణించింది.
రెండో సెషన్‌లో భారత్ 71 రన్స్ చేసినా 3 కీలక వికెట్లు పోగొట్టుకుంది. రాహుల్, జైస్వాల్ తోపాటు గిల్‌ను అవుట్ చేసింది ఇంగ్లండ్. వన్‌డౌన్ బ్యాటర్ సుదర్శన్, పంత్ నిలకడగా ఆడుతూ 149/3తో భారత్ టీ బ్రేక్‌కు వెళ్లింది. ఆఖరి సెషన్ లో సుదర్శన్, పంత్ ఎదురుదాడి చేసి 115 పరుగులు రాబట్టారు. కానీ, గాయం కారణంగా పంత్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. 68వ ఓవర్‌లో వోక్స్ యార్కర్ ను రివర్స్ స్వీప్ ఆడే క్రమంలో పంత్ కుడికాలికి బంతి బలంగా తగిలింది. ఆయన స్థానంలో జడేజా క్రీజులోకి వచ్చాడు. జడేజా, శార్దూల్ మరో వికెట్ కోల్పోకుండా రోజును ముగించారు. తొలి ఆట ముగిసే సమయానికి భారత్ 83 ఓవర్లలో 264/4 స్కోరు చేసింది.
Read Also: ఈ నెంబర్ జెర్సీ ని ఎవరు ధరించిన ఊరుకోం.. వైభవ్ పై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం!