
టెక్నాలజీ పెరిగిపోతోంది. చేతిలో ఫోన్.. అందులో ఇంటర్నెట్… ఇవి లేకపోతే రోజు గడవదు. నగరాలు, పట్టణాలే కాదు… గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. చదువుకున్న వారైనా… చదువుకోని వారైన… స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ ఉండాల్సిందే. దీన్నే.. సైబర్ నేరగాళ్లు వరంగా మార్చుకుంటున్నారు. ఫోన్లు హ్యాక్ చేయడం.. అకౌంట్లలో డబ్బు మాయం చేయడం… లేదా ఏపీకే ఫైల్స్ పంపండి. తెలిసో తెలియకో ఆ లింక్ నొక్కగానే… ఖాతాలో డబ్బు నొక్కేయడం. అంతేకాదు… ఆ ఫోన్లలోని కాంటాక్ట్ నెంబర్స్‌కి కూడా లింక్స్ పంపి.. వాళ్లను కూడా లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ఇలాంటి మోసమే జరిగింది. #PMKISAN పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు రైతుల అకౌంట్ల సమయం కావడంతో… ఆ పేరుతో ఓ రైతుకు వలవేశారు సైబర్ నేరగాళ్లు. పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోండి అంటూ ఏపీకే ఫైల్ పంపారు…. తన ఖాతాలో డబ్బులు పడ్డాయేమో తెలుసుకోవచ్చనుకుని… ఆ రైతు.. లింక్‌పై క్లిక్ చేశాడు. అంతే వెంటనే ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. అందులోని డేటా… సైబర్ నేరగాళ్ల కంట్రోల్‌లోకి వెళ్లిపోయింది. బాధిత రైతుకు తెలియకుండానే.. అతని ఫోన్‌లోని నెంబర్లకు ఏపీకే ఫైల్ లింక్ వెళ్లిపోయింది. ఆ లింక్ ఓపెన్ చేసిన.. ఓ వ్యక్తి అకౌంట్‌లోని డబ్బును సైబర్ నేరగాళ్లు కాజేశారు. బ్యాంకు ఖాతాలోని డబ్బు ఖాళీ అవడంతో… ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఒక్క సంఘటనే కాదు…. ఇలా ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, డబ్బుల జమ, లబ్దిదారుల జాబితా పేరుతో #Scammers సైబర్ మోసగాళ్లు.. అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్ పంపి.. వారిని నిండా ముంచేస్తున్నారు. ఏపీకే ఫైల్స్‌పై అవగాహన లేని వారు.. వారి మాయలో పడుతున్నారు. అందుకే వాట్సాప్ గ్రూపుల్లో గానీ… మెసేజ్ రూపంలో గానీ… ఏపీకే ఫైల్స్ వస్తే అప్రమత్తంగా ఉండాలని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు. మనకు తెలియని నెంబర్ నుంచి ఏ ఫైల్ వచ్చినా… ఆచీ తూచీ వ్యవహరించాలి. వీలైనంత వరకు ఆ లింక్స్ జోలికి వెళ్లకపోవడే మంచిది. లేదంటే… ఖాతాలో డబ్బులు కాజేయడమే కాదు… ఫోన్‌లోని వ్యక్తిగతసమాచారం, డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.
సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా… ఇంకా చాలా మంది మోసపోతూనే ఉన్నారు. ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సి ఉంది. ఒకవేళ పొరపాటులో లింక్‌పై క్లిక్ చేసి ఫోన్ హ్యాక్ అయ్యిందని, మోసపోయామని గుర్తిస్తే… వెంటనే పోలీసులను సంప్రదించాలి. డయల్ 100కి ఫోన్ చేయాలి. అలాగే.. టోల్‌ఫ్రీ నెంబర్ 1930 కూడా ఉంది. 1930 నెంబర్‌కు కాల్ చేసి జరిగిన విషయం చెప్తే.. సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. బాధితుడి బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసి.. డబ్బు అవతలి వారి అకౌంట్లలోకి వెళ్లకుండా చేసే అవకాశం ఉంటుంది. సో… తస్మాత్ జాగ్రత్త. ఏపీకే ఫైల్స్ జోలికి వెళ్లకండి… పొరపాటు జరిగితే… వెంటనే 1930కి కాల్ చేయండి.
ఇవి కూడా చదవండి..
-
రంగములోకి దిగిన రాట్ హోల్ మైనర్స్… ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠత?
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే… మాజీ మంత్రి కేటీఆర్
-
50 గంటలైనా కనిపించని జాడ.. 8 మంది కార్మికులు టన్నెల్ సమాధే?
-
రోజులు గడుస్తున్నాయ్…ఆశలు సన్నగిల్లుతున్నాయ్…ఆ 8మంది జాడేది..?
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే… మాజీ మంత్రి కేటీఆర్