
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ పార్టీ ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఎందుకంటే 2019లో దేశంలోనే ఎన్నడూ లేని విధంగా 151 సీట్లతో రికార్డు సృష్టించిన జగన్మోహన్ రెడ్డి… అదే రికార్డుతో 2024 ఎన్నికలలో కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ఘోర పరాజయం పొందింది. ఇక 2029 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గెలవాలి అంటే కచ్చితంగా పాదయాత్ర చేయాల్సిందే అని కార్యకర్తలు,జగన్ అభిమానులు కోరుతున్నారు. ఇక తాజాగా గుడివాడ అమర్నాథ్.. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నారని తెలిపారు. మరి గుడివాడ అమర్నాథ్ నిజంగానే చెప్పారా లేక తను ఊహించుకొని అన్నారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read : భారత్ దెబ్బకు తగ్గిన పాక్..దాడులు ఆపేస్తామని పాకిస్థాన్
దేశంలో రాజకీయంగా ఎదగాలి అంటే ఎన్నో విధాలుగా కష్టపడాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ఏదైనా రాష్ట్రంలో… ఒక పార్టీ గెలవాలి అంటే కచ్చితంగా పాదయాత్రని మొదటి ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే?.. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండడానికి గల కారణం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడమే. మరోవైపు 2014 ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసే అధికారాన్ని చేపట్టాడు. ఇక 2019లో జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం పాదయాత్రే . ఇంకా చెప్పాలి అంటే 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం గెలవడానికి గల ముఖ్య కారణం నారా లోకేష్ యువగళం పాదయాత్ర. కాబట్టి ఇదే బాటలో 2029 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తే మాత్రం… ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. లేదు తాడేపల్లి… ఫామ్ హౌస్ లోనే కూర్చుని రాష్ట్రంలో రాజకీయం చేస్తానంటే ప్రజలు ఎవరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో ఓడిపోయిన తరువాత ఎక్కువగా బెంగళూరుకి పరిమితమయ్యారు. కనీసం ప్రజల మధ్యకు వచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు. ఎన్నికలలో ఓటమి చెందిన తరువాత ఒకే ఒక్కసారి గుంటూరు మిర్చి యార్డుకు జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. అక్కడ రైతులతో కొంచెం సేపు చర్చించి మళ్లీ వెళ్లిపోయారు.ఇలా ఒకటి రెండు ప్రదేశాలకు తప్పించి ఎక్కడకి వెళ్ళలేదు. ఇక ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కూడా ప్రజల మధ్య జగన్ మోహన్ రెడ్డి కనిపించలేదు. మరి రాబోయే ఎన్నికలకు జగన్ పాదయాత్ర చేస్తే తప్పించి … ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి జగన్ తప్పనిసరిగా రాష్ట్రం అంతటా కూడా పాదయాత్ర చేయాల్సిందే.