
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈమధ్య హెచ్ సి యు పరిధిలోని కంచ భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు నిరసనలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే నిరసన చేసిన విద్యార్థులపై పోలీసులు కేసులను నమోదు చేశారు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనల లో భాగంగా ఎవరైనా విద్యార్థులపై కేసులను నమోదు చేస్తే తక్షణమే ఆ కేసులను ఎత్తివేయుండని విక్రమార్క తీర్పునిచ్చారు. HCU విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించాలని ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు.
ఇక జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులపై కేసులు ఉపసంహరించేలా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కేసులో ఉపసంహరణలో న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేలా చూసుకోవాలని అధికారులను బట్టి విక్రమార్క ఆదేశించారు. న్యాయశాఖ అధికారులు ఎందుకు తగినటువంటి సూచనలను చేయాలని వెల్లడించారు. కాగా దాదాపుగా 400 అటవీ భూములను ప్రభుత్వం అభివృద్ధి చేయాలనే ఆలోచనతో జెసిబి ల సహాయంతో వెంటనే అడవి ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రం చేయాలని కోరారు. అయితే ఇందుకు విరుద్ధంగా HCU విద్యార్థులు నిరసనలకు దిగారు. వన్యప్రాణులు నివసిస్తున్నటువంటి ఈ ప్రదేశంలో ఎటువంటి అభివృద్ధి అవసరం లేదని.. కాబట్టి ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించ వద్దని విద్యార్థులను నిరసనలకు దిగారు. దీంతో HCU విద్యార్థులు మరియు పోలీసుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. దాదాపు నాలుగు రోజులు పాటుగా సోషల్ మీడియాలో ఇదే టాపిక్ వైరల్ గా మారింది. చివరికి కోర్టులో ఈ విషయంపై చర్చించగా తీర్పునిచ్చే వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది.