Wednesday, March 18, 2026
Homeతెలంగాణభారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్!

భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్!

IMD Issues Heavy Rain Alert: రుతు పవనాల రాకతో దేశ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నారు. తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అటు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిపిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జనగాం సిద్ధిపేట యాదాద్రి భువనగరి, రంగారెడ్డి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని వెల్లడించింది.

పశ్చిమ కనుమలలో భారీ వర్షాలు
ముఖ్యంగా పశ్చిమ కనుమలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నారు. తమిళనాడులోని నీలగిరి, కోయంబత్తూర్‌ జిల్లాల్లో ఈ నెల 13 నుంచి 15 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కృష్ణగిరి, ధర్మపురి, తిరుపూర్‌ తో పాటు 11 జిలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

మరోవైపు మలప్రభ నదిలోకి భారీగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. కర్నాటకలోని బెళగావి  జిల్లా ఖానపుర తాలూకా కడకుంబి దగ్గర వరద పొంగిపొర్లుతోంది. కుసుమళి గ్రామం దగ్గర నదికి అడ్డంగా బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగున్నాయి. భారీ వరదతో నిర్మాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద తీవ్రతకు కొంతమేర రోడ్డు కొట్టుకుపోయింది. బెళగావి నుంచి జాంబోటె-చోర్ల మార్గంగా గోవాకు వెళ్లే రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. పాత వంతెన తొలగించి కొత్త వంతెన నిర్మాణాలు చేపడుతున్నారు. నదిలో తాత్కాలికంగా మట్టిరోడ్డును నిర్మించి రాకపోకలు ఇబ్బంది కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు బెళగావి నుంచి గోవాకు ఖానాపుర,  రామనగర మార్గం నుంచి వాహనాలను దారి మళ్లించారు. వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ మళ్లింపు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Read Also: వామ్మో అయోధ్య, భూములకు ఇంత ధరా?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments