
క్రైమ్ మిర్రర్, పల్నాడు:- పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలుగుజాతిని క్షమాపణ కోరుతూ ఒక వీడియోని విడుదల చేశారు. ఇందులో జీవి ఆంజనేయులు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యేలు మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా కేంద్రంలో మంత్రుల చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతున్న సమయంలో ఈ వేడుకలకు హాజరైనటువంటి వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జాతీయ జెండా రంగులేసినటువంటి ముగ్గు ను చూడకుండానే తొక్కుకుంటూ నడిచినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మన జాతీయ జెండాని అవమానించారు అంటూ సోషల్ మీడియాలో చాలానే చర్చ జరుగుతుంది.
Read also : మోడీ స్పీచ్ తో.. ప్రతి ఒక్కరి గుండెల్లో ఆత్మవిశ్వాసం నింపింది
దీనిపై చాలామంది నుంచి విమర్శలు రాగా.. తాజాగా జీవి ఆంజనేయులు మీడియా వేదికగా స్పందించారు. ప్రతి ఒక్కరికి నమస్కారం, దేశమంటే నాకెంతో ఇష్టం. జాతీయ జెండా అంటే కూడా చాలా ఇష్టం. ఈరోజు జరిగినటువంటి సంఘటన నన్ను జీవితాంతం బాధ కలిగించేలా చేస్తుంది అని అన్నారు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా అనుకోకుండా చూడకుండానే ముగ్గుని దాటానని… ఇది పొరపాటున జరిగింది.. అని ఇంకోసారి ఇలా జరగదు అని చెప్పుకొచ్చారు. తెలుగుజాతి ప్రజలు అలాగే దేశ ప్రజలు కూడా నన్ను క్షమించాలని కోరుతున్నా. జాతీయ జెండాను, దేశ ప్రతిష్టను పెంచే విధంగా దేశ గౌరవం పెరిగే విధంగా ఎల్లప్పుడూ కూడా కృషి చేస్తూ ఉంటానని దేవుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అని అన్నారు. రాజకీయ ప్రతిపక్షాలను కోరేది ఒకటే. అనుకోకుండా పొరపాటున జరిగినటువంటి సంఘటనను స్వార్ధ రాజకీయాలకు ఉపయోగించకూడదని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ వీడియో రూపం ద్వారా క్షమాపణలు కోరారు.
Read also : మీ క్రైమ్ మిర్రర్ తరపున.. కృష్ణాష్టమి స్పెషల్!.. ఇలానే జరుపుకోవాలి?